అరేబియా సముద్రంలో గుజరాత్‌కు నైరుతి దిశగా 1,165 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న పెను తుపాను ‘నీలోఫర్’ ఈ నెల 31న తీరం దాటుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. ప్రస్తుతం ఇది నైరుతి దిశగా పయనిస్తున్నప్పటికీ క్రమంగా దిశ మార్చుకుని ఈశాన్యానికి పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 31న గుజరాత్ రాష్ట్రంలోని నలియా వద్ద తీరం దాటే సమయానికి నీలోఫర్ క్రమంగా బలహీన పడే అవకాశం ఉందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉందని, వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లోను, తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గత రెండు రోజులతో పోలిస్తే సోమవారం వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: