ఎన్నికల ముందు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించినంతగా భారతీయ జనతా పార్టీ వాళ్లను విమర్శించిన వాళ్లు ఎవరూ లేరు! ప్రధానమంత్రి నరేంద్రమోడీపై, భారతీయజనతా పార్టీ అధినేత అమిత్ షాపై ఉద్ధవ్ చేసిన ఘాటైన వ్యాఖ్యానాలు చేసిన నేత మరొకరు లేరు. మహారాష్ట్రలో కాంగ్రెస్ , ఎన్సీపీ వంటి ప్రతిపక్షాలు ఉన్నా... వారి కన్నా ఎక్కువగా రెచ్చిపోయాడు శివసేనాని. మరి మొన్నటి వరకూ తిట్టిన నోటితోనే వారి దండకాన్ని అందుకొన్నాడాయన. ప్రధానమంత్రి నరేంద్రమోడీని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు ఉద్ధవ్ ఠాక్రే. మోడీ గ్రేటని.. అమిత్ షా ఇంకా గ్రేటని.. వీరిద్దరూ కలిస్తే ఇంకా ఇంకా గ్రేటని శివసేనాని అభిప్రాయపడుతున్నాడు. ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల ముందు వీళ్లనే ద్రోహులుగా అభివర్ణించాడు. వీరంతా కలిసి శివసేనకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు అవసరాలు మారాయి.. సమీకరణాలు చైంజ్ అయ్యాయి.. ఈ నేపథ్యంలో శివసేన కూడా యూటర్న్ తీసుకొంది. కమలనాథులపై శివసేనాని ప్రశసంలు కురిపిస్తున్నాడు. అంతే కాదు.. బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా.. తాము దానికి కట్టుబడి ఉంటామని శివసేన స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో భారతీయ జనతా పార్టీ గీసి గీతను దాటమని శివసేన ఒక ప్రకటన చేసింది. ఈ విషయంలో తమకు ఎలాంటి అభిప్రాయ బేదాలూ ఉండవని శివసేన స్పష్టం చేసింది. మరి మొన్నటి వరకూ మరాఠాగడ్డకు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ఉండిన శివసేన అధిపతి ఈ విధంగా చేతులెత్తేయడం... తిట్టిన పక్షాలనే తలకెత్తుకొంటుండటం విశేషమే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: