ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో అప్పుడే ఇరవై శాతం కోత విధించాలని నిర్ణయించుకుందని కధనం.ప్రధానంగా ప్రణాళేకేతర వ్యయం మొత్తం 85151 కోట్ల గా బడ్జెట్ లో ప్రతిపాదించగా, తాజాగా దానిని 68121 కోట్లుగా సవరించినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.అంటే సుమారుగా ఇరవై శాతం మేర బడ్జెట్ లో కోత పడినట్లు లెక్క. తమకు ఎంతో అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడు,సుదీర్ఘకాలం ఆర్దిక మంత్రిగా అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడుల ఆధ్వర్యంలో తయారైన బడ్జెట్ ను లక్షాపదకుండు వేల కోట్లుగా ఎలా నిర్ణయించారన్న చర్చ వస్తుంది.  అదే సమయంలో అంతా మూడు నెలల్లోనే సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయల మేర కోత పెడుతున్నట్లు ప్రకటించడం విశేషమే.అయితే ఇందులో జీతాలు,ఉపకార వేతనాలు,వృత్తిపరమైన సేవలు, కాంట్రాక్టు సేవలకు కోత ఉండబోదని ఆర్ధిక శాఖ చెబుతోంది.సాధారణంగా బడ్జెట్ లో ఎంతో కొంత సవరణలు ,కోతలు ఉంటాయి.కాని బడ్జెట్ పెట్టిన మూడు నెలల్లోనే ఇరవై శాతం కోత విధిస్తున్నట్లు చెప్పడం మాత్రం అరుదైన విషయమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: