దేశంలో ఇ-కామర్‌‌స బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారతీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ 2018 నాటికి నాలుగు రెట్లు వృద్ధి చెంది రూ.88,000 కోట్ల మార్కెట్‌కు చేరుకోనుంది. ఆర్‌ఎన్‌సీఒఎస్‌ అనే అధ్యయన, కన్సల్టెన్సీ సంస్థ అంచనాల ప్రకారం, 2014-18 మధ్యకాలంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ ఏటా 40-45 శాతం వృద్ధి చెందనుంది. డిజిటల్‌ విప్లవం నేపథ్యంలో భారతీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ గత కొన్ళేళ్ళుగా ఎంతో వృద్ధి చెందుతూ వచ్చింది. ఈ ధోరణి ఇంకొన్నేళ్ళ పాటు ఇలానే కొనసాగే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగం పరిమాణం రూ.21,000 కోట్ల మేరకు ఉండవచ్చునని అంచనా వేసింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ సమాజంలోకి చొచ్చుకెళ్ళడం, స్మార్‌‌ట ఫోన్లను అధికంగా కొనుగోలు చేయడం, ఈజీ షాపింగ్‌ కోరుకోవడం, సమయం ఆదా కావడం లాంటి అంశాలన్నీ కూడా దేశంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారం వృద్ధి చెందేందుకు తోడ్పడుతున్నాయి. ఆన్‌లైన్‌ పోర్టల్‌‌స అందిస్తున్న భారీ డిస్కౌంట్లు కూడా కస్టమర్లను అధికంగా ఆకర్షిస్తున్నాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగంలో విక్రయమవుతున్న వస్తువుల్లో ఉత్పాదన విభాగాలవారీగా చూస్తే, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌‌స మొదటి స్థానంలో నిలిచాయి. దుస్తులు, పుస్తకాలు ఆ తరువాతి స్థానంలో నిలిచాయి. కొన్నేళ్ళలోనే ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌‌స స్థానాన్ని దుస్తులు, యాక్సెసరీస్‌ ఆక్రమించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. వాటికి తోడుగా హోమ్‌ డెకర్‌, ఫర్నిషింగ్‌ విభాగాల మార్కెట్‌ కూడా పెరగనుంది. దేశీయంగా రూపొంది వృద్ధి చెందుతున్న అపెరల్‌ బ్రాండ్‌‌సకు ఆదరణ పెరగడం, హోమ్‌ డెకర్‌, ఫర్నీచర్‌ను ఆన్‌లైన్‌లో కొనేందుకు ఆసక్తి పెరగడం లాంటి అంశాలు దేశంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయి. మెరుగైన పేమెంట్‌, రిటర్‌‌న విధానాలు కూడా ఈ పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. స్మార్‌‌ట ఫోన్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు యాక్సెస్‌ కల్పించడం, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల ప్రజల ఆకాంక్షలు, మహిళలు మరింతగా టెక్‌సావీలు కావడం, బ్రాండెండ్‌ ఉత్పాదనలకు ప్రాచుర్యం పెరగడం లాంటి అంశాలన్నీ కూడా దేశంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారం పెరిగేందుకు కారకాలుగా నిలుస్తున్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ మరెన్నో సవాళ్ళు కూడా ఈ రంగం ముందు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సరిగా లేకపోవడం వంటివి ఈ రంగం వృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది కస్టమర్లు ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీల భద్రతపై అనుమానాలు కలిగి ఉండడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: