ఆయన ఓ టీడీపీ సీనియర్ నేత.. దాదాపు 20 ఏళ్ల పాటు ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా.. అవకాశాలు అందినట్టే వచ్చి.. చేజారిపోయినా బాధపడకుండా పార్టీనే అట్టిపెట్టుకున్నారు. తన కన్నా జూనియర్లు తన కంటే ముందే ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోతున్నా.. పెద్దగా బాధపడకుండా పార్టీపైనే దృష్టిపెట్టాడు. కష్టేఫలి అన్న మాటలు వృధాపోవు కదా.. అందుకే ఎమ్మెల్యే అయిన తొలిసారే జాక్ పాట్ కొట్టేశారు. ఎన్నడు మంత్రి కూడా కాని ఆయన.. ఏకంగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. కేవలం ఉపముఖ్యమంత్రే కాదు.. కీలకమైన హోంశాఖ కూడా తనకే దక్కడంతో చిన్నరాజప్ప పెద్దగానే ఖుషీ అయ్యారు. ఇక చించేద్దా.. కుమ్మేద్దాం అనుకున్నారు. మరి పాలనానుభవం లేకనో.. లేక.. ఎత్తులు పైఎత్తులు, లౌక్యం పెద్దగా లేకపోవడం వల్లనో.. ఎందుకనో.. ఆయన్ను సొంత డిపార్ట్ మెంటు పెద్దలే పెద్దగా పట్టించుకోవడం లేదంట. దీంతో నిమ్మకాయల చినరాజప్పకు సొంత డిపార్ట్ మెంట్ పెద్దలంటే.. మండుకొస్తోందట. చివరకు సొంత జిల్లాలో తాను చెప్పిన విషయాలను కూడా పెద్దగా పట్టించుకోకపోయేసరికి.. తనను ఎవరూ కేర్ చేయడం లేదని లోలోపల కుతకుతా ఉడికిపోతున్నారు. ఆయన తన గుండల్లో బాధనంతా.. ఆయన మంగళవారం బయటపెట్టారు. ఎప్పుడూ అమాయకంగా.. సౌమ్యంగా ఉండే ఆయన ఒక్కసారిగా పోలీసు అధికారులపై ఫైర్ అయ్యారట. హోంమంత్రి రాజప్ప ఇంటికి ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీస్ సిబ్బందిని నానా మాటలూ అన్నారట. మీరూ..వద్దు.. మీ ఎస్కార్టూ వద్దు.. మీ పై అధికారులు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. మా మాట వినడం లేదంటూ నిప్పులు చెరిగారంట. తనకు గార్డులు అవసరం లేదంటూ.. వారు తేరుకొనేలోపే.. రాజప్ప అమలాపురం నుంచి పెద్దాపురం వెళ్లిపోయారంట. సొంత జిల్లా అధికారులపై గుర్రుగా ఉన్న ఆయన సీఎం వద్దే పంచాయతీ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: