నల్లధనికుల జాబితాను కచ్చితంగా బయటకు పెట్లాల్సిందేనని అని స్పస్టం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు కోర్టు కేంద్రప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జాబితాను పూర్తిగా వెల్లడించాలని సూచించింది. కేవలం ఎనిమిది మంది పేర్లు చెప్పి ఊరుకోవడం ఏమిటని? మిగతా అందరి పేర్లనూ బయటకు వెళ్లడించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. నల్ల ధనికుల జాబితాను పూర్తిగా బయట పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి అదే జరిగితే.. దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే బయటకు వచ్చిన నల్లధనికుల పేర్లు ఆసక్తిని రేపుతున్నాయి. వాళ్లను అరెస్టు చేస్తారా? ఆ డబ్బును దేశానికి తెప్పిస్తారా? వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మరి ఏకంగా అన్ని పేర్లూ బయటకు వస్తే... అది రాజకీయంగా సంచలనమే అవుతుంది. నల్లధనికుల జాబితాలో అనేక మంది రాజకీయ వ్యాపార రంగ ప్రముఖుల పేర్లు ఉన్నాయన్న ఊహాగానాలున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అలాంటి వారి పేర్లు..అందరికీ తెలిసిన పేర్లు గనుక బయటకు వస్తే.. అంతకన్నా సంచలనం ఏముంది? అయితే కేంద్ర ప్రభుత్వంఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించడం లేదనేది మాత్రం సుస్పష్టం.ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశాడు. మొత్తానికి ఈ నల్లధనికుల వ్యవహారం రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. మరి ఎక్కడ వరకూ వెళుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: