భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలకు, దేశాభివృద్ధికి పొంతన లేకుండా పోయింది. స్వయాన ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఇటీవల 189దేశాల్లో జరిగిన సర్వేకు సంబంధించి 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' నివేదికను ప్రపంచ బ్యాంక్‌ బుధవారం విడుదల చేసింది. ఈ సర్వేలో, భారత్‌కు 142వ ర్యాంక్‌ దక్కింది. గత ఏడాది ర్యాంక్‌తో పోలిస్తే భారత్‌ రెండు స్థానాలకు పడిపో యింది. కాగా, తాజా జాబితా 'ఈజ్‌ ఆఫ్‌ డూ యింగ్‌ బిజినెస్‌' నివేదికలో సింగపూర్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఇతర దేశాలు మంచి సామ ర్థ్యాన్ని ప్రదర్శించిన కారణంగా ఇండియా ర్యాంక్‌ గతేడాది 140కి పడిపోయింది. ఎందుకంటే, గత ఏడాది భారత్‌ ర్యాంక్‌ వాస్తవికంగా 134వద్ద ఉంది. కానీ, ప్రపంచబ్యాంక్‌ తాజాగా సవరించిన సమాచారంలో భారత్‌ 140ర్యాంక్‌లో నిలిచింది. 2014 నివేదికలో భారత్‌కు 52.78 పాయింట్లు లభించగా, ఈ ఏడాది 53.97పాయింట్లను చేరింది. అయితే, తాజా ర్యాంకింగ్‌లో మోడీ ప్రభు త్వం స్నేహపూర్వక వ్యాపారం కోసం చేపట్టిన 'మేకిండియా' చర్యలను పరిగణనలోనికి తీసుకో లేదు. 'భారత్‌ ర్యాంక్‌ దిగజారడం వెనుక ఏదైనా తాజా రాజకీయ పరిస్థితి ముడిపడి ఉందా అనేలా ఆకట్టుకునే సందేశాన్ని మేం పంపించదలచుకోలేదు' అని ప్రపంచ బ్యాంక్‌ విభాగం అభివృద్ధి ఆర్థికశాస్త్రం గ్లోబల్‌ ఇండికేటర్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ లొపె జ్‌-క్లారస్‌ చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయిం గ్‌ బిజినెస్‌ మే 31వ తేదీతో ముగిసిన విష యాన్ని లొపెజ్‌ గుర్తు చేశారు. ప్రభుత్వం ఏమి చేయబోతుం దనే ఈ సూచికల ప్రభావం కేవలం వచ్చే ఏడాది మాత్రమే వెల్లడవుతుందన్నారు. అయితే, తదుపరి నివేదికలో మాత్రమ భారత్‌ వ్యాపార ప్రాముఖ్యత అనూ హ్య రీతిలో అత్యున్నత స్థాయిలో ఉం టుందన్నారు. కాగా, తాజా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో సింగపూర్‌ 88.27 పాయింట్లు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. అయితే, న్యూజిలాండ్‌, హాంగ్‌కాంగ్‌, డెన్మార్క్‌, దక్షిణకొరియా తదుపరి స్థానాల్లో నిలిచింది. కాగా, ఇతర ప్రధాన దేశాల్లో అమెరికా (7), బ్రిటన్‌ (8), చైనా (90), శ్రీలంక (99), నేపాల్‌ (108), మాల్దీవులు (116), భూ టాన్‌ (125), పాకిస్థాన్‌ (128) ర్యాంక్‌ల్లో నిలిచాయి. 'భారత్‌ ర్యాంకింగ్‌ కొద్దిగా మాత్రమే పడిపోయింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత 12నెలలుగా కొంత మెరుగైంది' అని లొపెజ్‌-కార్లస్‌ తెలిపారు. ఇదిలాఉంటే, డూయింగ్‌ బిజినెస్‌ నివేదిక లీడ్‌ ఆథర్‌ రిటా రమాల్హో మాట్లాడుతూ భారత్‌ ర్యాంకింగ్‌ పడిపోయిందన్నారు. దేశ వ్యాపార వాతావరణం మెరుగుపడటానికి బదులు దిగజారిందన్నారు. ఇతర దేశాలు బాగా వ్యాపారంలో బాగా మెరుగయ్యాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: