అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఇప్పటికే టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీలోకి ఎంటరయ్యారు. తెలుగుదేశం పార్టీకి వారు తలాక్ చెప్పారు . సైకిల్ గుర్తుపై గెలిచి నాలుగు నెలలు కూడా కాకుండానే వీళ్లు కారు ఎక్కేశారు. మరి ఇలా పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి ఎమ్మెల్యేలు అనర్హులు అవుతారు. మరి ఈ లెక్క ప్రకారం చూసుకొంటే.. తెలుగుదేశం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలుగా అర్హతను కోల్పోతారు. దీంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు తప్పవు! అయితే అలాంటి ఉప ఎన్నికలు ఇప్పటికిప్పుడు వచ్చేస్తాయని చెప్పడానికేం లేదు. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటిస్తేనే... ఉప ఎన్నికలు వస్తాయి. అయితే స్పీకర్ టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తి. అధికార పార్టీ పక్షపాతిగా ఉండటం సహజమే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వైపు వచ్చిన ఎమ్మెల్యేలపై ఇప్పుడప్పుడే అనర్హత వేటు పడే అవకాశం లేదను కోవాలి. అయితే ఈ విషయంలో టీడీపీ వారు మరీ ఒత్తిడి తీసుకొచ్చినా.. టీఆర్ఎస్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు రెడీ అయినా... ఉప ఎన్నికలు వస్తాయి. మొత్తానికి గత టర్మ్ లో తెలంగాణలో అనేక నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ రాజకీయాలతో ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగేలా ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: