లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు.. కాస్త ఎక్కువగా సినిమాల్లో పాపులర్ అయిన ఈ డైలాగ్.. ఇప్పుడు కేసీఆర్ వల్లె వేస్తున్నాడు. బడ్జెట్ అంటే ఎప్పుడో మార్పి - ఏప్రిల్లో పెట్టుకుంటారు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని.. ఈసారి తెలంగాణలో బడ్జెట్ నవంబర్ నెలలో ప్రవేశపెడుతున్నారు. లేట్ గా ప్రవేశ పెట్టినా జనం మెచ్చే బడ్జెట్ రూపొందిస్తామని టీఆర్ఎస్ ఊదరగొడుతోంది. కోటి ఆశలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి వార్షిక ప్రణాళిక నవంబర్ ఐదో తేదీన ప్రజల ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎనభై వేల కోట్లకు పైగా పద్దుతో తెలంగాణ బడ్జెట్ వస్తోంది. ఇందులో అగ్రతాంబూలం నీటిపారుదల శాఖకే దక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, సంక్షేమానికి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎన్నికల ముందు తెరాస ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇస్తారట. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించిన సర్కారు, తొలి బడ్జెట్ లో నీటి పారుదల రంగానికి అధిక ప్రధాన్యం ఇవ్వబోతోంది. నీటి పారుదల శాఖ అంశాల కోసం రూ. 6,500కోట్ల మేర బడ్జెట్లో కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది వ్యయంతో పూర్తై ఆయకట్టుకు నీరిచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించేందుకు సర్కారు సిద్ధమైంది. వచ్చే ఖరీఫ్ కల్లా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందించడం, ఆయకట్టును స్థిరీకరించటం లక్ష్యంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెడుతున్న జారాల పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు కూడా బడ్జెట్ లో తగిన నిధులు ఇవ్వనున్నారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన సర్కారు...చిన్న నీటి పారుదల రంగానికి కూడా రూ. 2000 కోట్ల వరకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: