అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపడతారని మొదట్లో కొన్ని ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్నాళ్లుగా తన వద్ద మిగిలివున్న మంత్రిత్వ శాఖలను మిగతా కేబినెట్ మంత్రులకు కేటాయించారు. నవంబర్ 5 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయా శాఖల పరిధిలో వున్న సమస్యలు, పెండింగ్‌లో వున్న అంశాలపై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వీలుగా ఆ మిగులు శాఖలని వారికి కేటాయించారు. ప్రస్తుతానికి ఆయా శాఖల నిర్వహణ బాధ్యతలని కూడా వారికే అప్పగించారు. కేసీఆర్ తన వద్ద వున్న మిగతా శాఖలని కేబినెట్ మంత్రులకే అప్పగించడంతో ఇక ఇప్పుడప్పుడే కేబినెట్ విస్తరణ వుండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కేబినెట్ విస్తరణ చేపడితే ఈసారైనా తమకి అవకాశం లభిస్తుందో ఏమోనని ఆశ పడినవాళ్లంతా ఈ పరిణామంతో అయోమయంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: