2016 అసెంబ్లీ ఎన్నికలకు.. తమిళపార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆగర్భ శతృవు జయలలితను ఓటమి పాలు చేసేందుకు.. పాత శతృవులంతా ఏకమయ్యారు. సరికొత్త కూటమికి తుది రూపం తెచ్చేపనిలోపడ్డారు.. స్టాలిన్. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓ బలమైన కూటమిని తయారుచేసే పనిలో డీఎంకే నిమగ్నమైంది. డీఎంకే నేత స్టాలిన్ అత్యంత వేగంగా పావులు కదుపుతూ.. సరికొత్త సమీకరణాలను తెరమీదకు తెస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత.. స్టాలిన్.. MDMK జెనరల్ -సెక్రెటరీ వైకోతో భేటీ అవ్వడం విశేషం.  పీఎంకే నేత.. కేంద్రమాజీ మంత్రి..అంబుమణి రాందాస్ కుమార్తె వివాహానికి హాజరైన స్టాలిన్, తమిళనాడులో సరికొత్త రాజకీయ కూటమికి ప్రాణంపోసే పనిలో పడ్డారు. మహాబలిపురంలో జరిగిన PMK, MDMK, DMK నేతల భేటీ.. రాష్ట్రంలో తదుపరి రాజకీయాలను శాసించేలా కనిపిస్తోంది. 1993లో డీఎంకేలో స్టాలిన్ పెత్తనాన్ని నిరసిస్తూ.. వైకో.. డీఎంకేను వీడి.. MDMKను ప్రారంభించారు. త్వరలో.. సరికొత్త కూటమిగా ఈ మూడు పార్టీలు జయలలితకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: