ఢిల్లీలోని జామా మసీదు నూతన ఇమామ్‌గా తన కుమారుడు షాబన్(19) నియమించే కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను ఆహ్వానించానని, భారత ప్రధాని నరేంద్రమోదీని మాత్రం ఆహ్వానించలేదని ప్రకటించి జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివాదానికి తెర లేపారు. అంతేకాకుండా, భారతీయ ముస్లింల విశ్వాసాన్ని ఇంకా మోదీ గెలుచుకోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ కుటుంబంతో తన తండ్రి కాలం నుంచి సంబంధాలున్నాయన్నారు. ‘అధికారంలోకి వచ్చాక కూడా భారత ముస్లింల కోసం మోదీ ఏమీ చేయలేదు. వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించలేదు. 2002 గుజరాత్ అల్లర్లపై కనీసం క్షమాపణలు చెప్పలేదు. ముస్లింలు ఆయన్నింకా క్షమించలేదు’ అని వ్యాఖ్యానించారు. మోదీని ఆహ్వానించకపోవడానికి కారణం చెబుతూ ‘ఆయనకు మేమంటే ఇష్టం లేదు. మాకూ ఆయనంటే ఇష్టం లేదు... అంతే’ అన్నారు. నవంబర్ 22న జామా మసీదులో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, హర్షవర్ధన్‌లతోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులను ఆహ్వానించానని బుఖారీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: