తెలంగాణ ప్రబుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి కృష్ణా జలాల నిర్వహణ బోర్డు అనుమతించింది.అయితే నవంబర్ మూడు వరకు మూడు టి.ఎమ్.సిల నీటిని వాడుకోవాలని సూచించింది.ఆంద్రప్రదేశ్,తెలంగణ ప్రభుత్వాలు దీనిపై ఒక అవగాహనకు రావడంలో విపలమైన నేపధ్యంలో బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.అయితే మూడో తేదీ వరకు మూడు టి.ఎమ్.సి. ల నీరు వాడుకోవాలని చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుందా అన్నది చర్చనీయాంశం.834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ అంటుంటే, 854 అడుగుల నీటి మట్టం ఉండాలని,లేకుంటే రాయలసీమకు నీటి ఇబ్బంది వస్తుందని ఎపి ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశంపై బోర్డు వివరణ ఇచ్చినట్లు లేదు.తిరిగి నవంబర్ పదిహేను బోర్డు సమావేశం అయి సమీక్షిస్తుందని తెలియచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: