శివసేన ప్రతిపక్షంలో కూర్చుంటుందా? .. లేక.. ఎన్సీపీలానే.. బయటినుంచి మద్దతిస్తుందా ?.. అసలు ఉద్ధవ్ఠాక్రే మనసులో ఏముంది ? శివసేనమాత్రం.. సర్కారులో చేరేందుకు ఇప్పుడుకూడా సిద్ధంగా ఉన్నట్టు ఉద్ధవ్ వ్యవహారశైలి పైకి కనిపిస్తోంది. మరోవైపు.. సేనతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. సీఎం.. ఫడ్నవిస్ వెల్లడించారు. నిజానికి.. శివసేనను బీజేపీ ఏదశలోనూ ఖాతరు చేయకపోవడం అసలు విషయం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారానికి బాయ్కాట్ చేస్తూ.. హాజరుకావడంలేదంటూ..చివరి నిమిషంవరకూ హెడ్లైన్లో నిలిచారు.. శివసేన చీఫ్ ఉద్ధవ్ఠాక్రే. ఉన్నట్టుండి.. బ్రేకింగ్ న్యూస్లో సస్పెన్స్కు తెరతీస్తూ.. తాను ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నట్టు.. ఉద్ధవ్ వెల్లడించి.. అందిరికీ ఆశ్చర్యం కలిగించారు. ఉద్ధవ్తోపాటు.. సేన ప్రముఖ నేతలు, పార్టీ ఎంఎల్ఏలంతా హాజరయ్యారు. సీఎం ఫడ్నవిస్మాత్రం.. శివసేనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ప్రకటించారు. ఎటుతిరిగీ.. శరద్పవార్ పార్టీ.. ఎన్సీపీ బయటినుంచి.. బీజేపీ సర్కారుకు మద్దతిస్తామని .. పైపెచ్చు.. విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతామని ప్రకటించారో.. ఇక అప్పటినుంచి.. ఉద్ధవ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. ఒకవేళ.. ఎన్డీఏనుంచి బయటికి వద్దామనుకుంటే.. అసలే.. మహారాష్ట్రలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.. పైపెచ్చు.. కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సివస్తుంది. అంతేకాదు..ప్రతిష్టాత్మక.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పదవిని వదులుకోవాల్సి వస్తుంది. బృహన్ముంబై కార్పొరేషన్.. శివసేన-బీజేపీ కూటమి చేతిలోనే ఉంది. పైపెచ్చు.. కోట్ల రూపాయల కాసులు కురిపించే.. ఈ పదవిని వదులుకోవడానికి.. శివసేన ససేమిరా అంటోంది. దీంతో.. ఇటు ఆత్మాభిమానం చంపుకోలేక.. మరోవైపు.. ఓమెట్టుదిగి.. సర్కారులో చేరనున్నట్టు ప్రకటించేందుకు.. ఉద్ధవ్ ఠాక్రేకు అహం అడ్డువస్తోంది. ఒకవేళ సర్కారులో భాగస్వామి కాకపోతే.. ఎక్కడ ఎంఎల్ఏలను, బీజేపీ ఆకర్షిస్తుందోననే భయం.. ఉద్ధవ్ను వెంటాడుతోంది. మరోవైపు.. బీజేపీకూడా శివసేన బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకుండా.. పాతికేళ్ల సంబంధానికి రాంరాం చెప్పడం... అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు గట్టిదెబ్బ తగిలేలా చేసింది. వెరసి.. శివసేన ఇప్పుడు.. అధికార పక్షంతో చేతులు కలపాలా.. లేక.. ప్రతిపక్షంలో కూర్చోవాలా అని యోచించాల్సిన సంకటస్థితిలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: