ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించేందుకు గల సాధ్యా సాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. నాగార్జున యూనివర్సిటీలోని డైక్‌మన్‌ హాలులో వీటిని నిర్వ హించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబం ధించి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌రావు నాగార్జున యూనివర్సిటీని సోమవారం సందర్శించే అవకాశాలు వున్నాయి. ఆయనతోపాటు ఉన్నతాధికారుల కూడా వుంటారు. భద్రత, ఇతర వసతులు సరిపోయే పక్షంలో శీతాకాల సమావేశాలను డైక్‌మన్‌ హాలులో నిర్వహిస్తారని భావిస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపానున్నారు. దానిపై ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే శీతాకాల సమా వేశాలు నాగార్జున యూనివర్సిటీలో జరుగుతాయి. డైక్‌ మన్‌ హాలును తాత్కాలిక అసెంబ్లీగా మారుస్తారు. ఈ నెలాఖరులో కాని, లేదా డిసెంబర్‌ మొదటివారంలో కాని శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావి స్తోంది. వారం నుండి పది రోజుల పాటు ఈ సమా వేశాలు జరిగే అవకాశం వుంది. అక్కడ సాధ్యంకాని పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని సమావేశాలను నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: