ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం జరుగుతున్న భూసే కరణలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపి సిఎం చంద్రబా బు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 18 (మంగళవారం) చంద్ర బాబు నేరుగా తుళ్లూరులో పర్యటించి నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహిం చనున్నారు. ఈ విషయాన్ని అదివారం బాబే స్వయంగా వెల్లడించారు. గుంటూ రు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో శనివారం జరిగిన సంఘటనపై ఆ జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావునేరుగా చంద్రబా బను కలసి అక్కడ పరిస్ధితిని వివరించారు. అసలు అక్కడ ఏం జరుగుతుందని బాబు ఆరా తీశారు. రైతులను ఎవరు రెచ్చగొడుతున్న విషయం కూడా అడిగి తెలుసుకున్నారు. రైతులకు పరిస్ధతిని వివరించాల్సింది పోయి సమావేశాల పే రుతో హాడావుడి ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నించినట్లు సమాచారం.రాజధానికి భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్న వారిని కూడా రెచ్చగొడుతున్నారని పు ల్లారావు సిఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో రాజధాని విషయంలో జరుగు తున్న రగడకు పుల్‌స్టాప్‌ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.  రైతులతో మంగ ళవారం మూడుగంటలకు చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడతారు. రాజధా ని విషయంలో భూసేకరణ(ల్యాండ్‌పూలింగ్‌)పై రైతుల్లో ఉన్న అపోహాలను తొల గించడంతోపాటు పూర్తి విస్వాశాసాన్ని నింపేందకు ప్రయత్నిస్తారు. పరిహారం ఇచ్చే విధానంపైన స్పష్టత ఇస్తారు. భూములు ఇవ్వడానికి సిద్దపడక పోతే జరిగే నష్టాలను సైతం వారికి వివరిస్తారు. భూసేకరణ విషయంలో ఎవరికి అన్యా యం జరగన్విబోమని హామీ ఇవ్వనున్నారు.రాజధాని రావడం వల్ల జరిగే లాభా లను రైతులకు పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తుళ్లూరు టూర్‌కు సంబందించి ఇప్పటికే పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: