సమాజం కష్టాల్లో ఉంది.. అన్నాడు కోదండరాం. మరి ఏ సమాజమో డీటెయిల్డుగా చెప్పలేదాయన. అయితే తెలంగాణ వాది కాబట్టి.. తెలంగాణ సమాజం గురించినే ఆయన మాట్లాడి ఉండాడని అనుకోవాల్సి వస్తోంది. అసలు కోదండరాం మాస్టారు వార్తల్లోకి రాక చాలా కాలం అయ్యింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆయన పెద్దగా వార్తల్లోకి వచ్చిందే లేదు. ఇటువంటి నేపథ్యంలో కోదండరాం మళ్లీ కాస్తంత హడావుడి చేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడతామని ప్రకటన చేశాడు! మరి ఇప్పుడు తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాడటం అంటే ప్రభుత్వాధినేత కేసీఆర్ పై పోరాటమే అవుతుంది. తెలంగాణ సమస్యలకు కేసీఆర్ ను బాధ్యుడిని చేసినట్టు అవుతుంది. తెలంగాణ సమస్యలపై పోరాడితే కోదండరాంపై కేసీఆర్ కు ఏమీ కోపం లేకపోవచ్చు. అయితే... ఆ సమస్యలకు మూల కారణం ఆంధ్రవాళ్లే అని అనాలి. అదీ కేసీఆర్ లెక్క. ఇన్నేళ్ల పాలనలో జరిగిన అన్యాయం వల్ల... తెలంగాణలో సమస్యలు నెలకొన్నాయి అని అంటే.. అప్పుడు కేసీఆర్ కోదండలాంటి వాళ్లను మెచ్చుకొంటాడు. తెలంగాణసమస్యలకు కేసీఆర్ కారణమనో. కొత్తగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వమే కారణమనో అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ఆ వాదనను ఎంకరేజ్ చేయడు! అలా మాట్లాడితే కోదండ కూడా తెరాస దృష్టిలో తెలంగాణ ద్రోహి అవుతాడు. అయితే కోదండరాం తెలంగాణ ఏర్పడ్డాకా.. అంతయాక్టివ్ గా కనపడటం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఈయనను ఏ మాత్రం ఎంకరేజ్ చేయడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎక్కడలేని తెగువను చూపిన కోదండరాం.. సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ ప్రజాసమస్యలపై పోరాడతామని ప్రకటన చేసినప్పటికీ.. ఇది పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అని అనుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: