రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ తరహా రాజధాని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు తెలిపారు. కచ్ఛితమైన ప్రణాళిక, కఠోర శ్రమ, పాలకుల చిత్తశుద్ధితో సింగపూర్ అభివృద్ధి చెందిందన్నారు. అక్కడ అవినీతి లేదని చెప్పారు. మంచి పరిపాలనతో వారు బాగా అభివృద్ధి చెందారన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో తనకు చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఒక ఇటుకను ఇవ్వాలన్నారు. ప్రతి తెలుగువాడు రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని కోరారు.రాజధాని ప్రాంత రైతులు తనపై పూర్తి నమ్మకం పెట్టారని చెప్పారు. కొంతమంది రాజకీయం చేస్తున్నారని అన్నారు. తుళ్లూరు రైతులతో తాను ఎల్లుండి మాట్లాడతానన్నారు. ల్యాండ్ పూలింగ్ లో ఎవ్వరికీ అన్యాయం జరుగకుండా చూసుకుంటానని చెప్పారు. తనకు ఉండే తెలివితేటలన్నీ ఉపయోగించి రైతులకు ప్రయోజనం కలిగిస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా నీటిని రాయలసీమకు ఇవ్వవచ్చునన్నారు. మరో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవచ్చునని చెప్పారు. మంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. రెండు రాష్ట్రాలు సయోధ్యతో ముందుకు పోవాలన్నారు. తమ వాళ్లనో, హెరిటేజ్నో, తననో టార్గెట్ చేస్తే ఏం సాధించలేరని అన్నారు. సమస్యల పరిష్కారానికి బోర్డులు, కేంద్రం, కోర్టులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. Chandrababu Naidu, AP capital Master Plan, Singapore, చంద్రబాబు నాయుడు, ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్, సింగపూర్

మరింత సమాచారం తెలుసుకోండి: