మరికాసేపట్లో సిడ్నీలోని అల్ఫోన్స్ అరీనాలో జరిగే మోదీ బహిరంగ సభకు కనీసం 30 వేల మందికి పైగా హాజరైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 20 వేల మంది వరకు చేరుకున్నారు. అల్ఫోన్స్ అరీనా నిండిపోయింది. ఇంకా వస్తున్న మోదీ అభిమానులను స్టేడియం లోనికి అనుమతించటం లేదు. మరోవైపు అల్ఫోన్స్ అరీనాకు దారి తీసే దారులన్నీ మోదీ చిత్రపటాలు, పోస్టర్లు తదితరాలతో అలంకరించారు. మోదీ సభ కోసం రాత్రంతా నిద్ర పోకుండా స్టేడియం బయట ఎప్పుడు గేట్లు తీస్తారా అని కనీసం 5 నుంచి 6 వేల మంది ఎదురు చూస్తూ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెల్ బోర్న్, ఇతర ప్రాంతాల నుంచి సిడ్నీకి విమానాల్లో వందలమంది మోదీ ప్రసంగం కోసం వచ్చారు. బహుశా సిడ్నీలో ఇప్పటివరకు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరిగి ఉండదని అంటున్నారు. ఇప్పటివరకు మరే విదేశీ నేతకు ఇంత భారీ స్పందన లభించలేదు. ముందుగా ఇక్కడికొచ్చిన నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆ ఫొటోలను మోదీ ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: