తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ లో ఆందోళనలు ఉండవనుకుంటే మళ్లీ , విద్యార్ధుల ఆందోళన పర్వం లో దిగారు. విద్యార్ధులు చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్ధులు గేటు వద్దకు వస్తే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దం అవుతున్నారు.ఒక దశలో పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేష్ ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగుల ను శాశ్వతం చేయకుండా అందరిని పరీక్షల ద్వారానే నియామకాలు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఏర్పడడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: