రాష్ట్రవిభజన తర్వాత ఆంధ్రా, తెలంగాణల మధ్య నీటి సమస్యలు, విద్యుత్ గొడవలు వస్తాయని ముందుగా ఊహించిందే. దేశంలోని ఏ రెండు రాష్ట్రాలకూ లేనంత ఉమ్మడి సరిహద్దు ఈ రెండు రాష్ట్రాలకూ నదీరూపంలో ఉండటమే ఇందుకు కారణం. రెండు రాష్ట్రాల మధ్య శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. వాటి జలపంపకాలు, విద్యుత్ పంపకాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇకపై అవుతాయి కూడా.                                     తాజాగా రెండు రాష్ట్రాల మధ్య శ్రీశైలం జల విద్యుత్ వివాదం నడుస్తోంది. విద్యు్త్ కోసం నీరు వృధా చేస్తే.. రాయలసీమకు తాగునీరు ఉండదు మొర్రో అని ఏపీ నేతలు మొత్తుకుంటున్నారు. కేసీఆర్ మాత్రం విద్యుత్ లేక మా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మీరు తాగునీరు ఎంత అవసరమో.. మాకు విద్యుత్ అంతే అవసరమని వాదిస్తున్నారు.                                       ఈ విషయంలో ఎవరి మాటలూ లెక్కచేసే పరిస్థితిలో కేసీఆర్ లేరు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేందుకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కాళ్లు పట్టుకోవడం తప్ప అన్ని పనులూ చేశామన్నారాయన. కేసీఆర్ కృష్ణాబోర్డు చెప్పినా వినలేదని.. ఆ బోర్డు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చివరకు గవర్నర్ కు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: