తెలంగాణ రాష్ట్రంలో చితికిపోయిన పార్టీని గట్టెక్కించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహం రచిస్తోంది. తనకు కలిసొచ్చిన పాదయాత్రలు, పరామర్శ యాత్రల హస్త్రాన్న్రి మరో మారు ప్రయోగించనున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసు కొన్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమాలోచనలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జగన్‌ సోదరి షర్మిళ పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. సమైక్య నినాదాన్ని ఏకపక్షంగా ఎత్తుకొని అటు ఏపిలో అ ధికారంలోకి రాకపోగా తెలంగాణలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మార డంపై వైఎస్సార్‌సిపి పార్టీలో అంతర్గత చర్చమొదలైంది. ఏపి వ్యవహారా లపై పూర్తిగా దృష్టిసారించిన ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ వ్యవహారాలపైనా ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు తెలు స్తోంది.మొన్నటివరకు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఉదాసీన వైఖరిని ప్రదర్శించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఇప్పుడు పార్టీ బలోపే తంపై దృష్టిసారించినట్లు సమాచారం. అందుకే పార్టీ కేంద్ర పాలక కమి టీలోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలకు జగన్మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణ విషయం లో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సుధీర్ఘ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు సమా చారం. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈరాష్ట్రంలోనూ పార్టీని బతికించుకోవాలన్న ఆలోచనకు జగన్మోహన్‌రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న త్రిముఖ పోటీ నేప థ్యంలో మున్ముందు సంకీర్ణ ప్రభుత్వాలకు ఆస్కారం ఉండొచ్చని వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. అదే జరిగితే తెలంగాణలోనూ చక్రం తిప్పవచ్చన్న వ్యూహంతో ఆ పార్టీ ముందుకెళ్తు న్నట్లు సమాచారం.తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ బలోపేతం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక కార్యక్ర మాలు చేపట్టాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే టి ఆర్‌ఎస్‌పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించాలన్న దానిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొంత స్పష్టత వస్తున్నట్లు తెలుస్తోంది. టి రాష్ట్రంలోఉన్న పార్టీ క్యాడర్‌ను కాపాడుకొనే ప్రయత్నంచేయాలని కూడా ఆ పార్టీ సమాలోచ నలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సమీక్ష కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకత్వం, షర్మిళ పాదయాత్రతో పార్టీలో జోష్‌ నింపాలని యోచిస్తోంది. రైతుల రుణ మాఫి అంశంతోపాటు రైతు ఆత్మహత్యలపై పార్టీ పరంగా ప్రత్యేక కర్యాక్రమాలు చేపట్టాలని వైఎస్సా ర్‌సిపి అగ్ర నాయకత్వం చేపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం లోనూ పార్టీని బలోపేతం చేసుకొవడంతోపాటు ఉన్న క్యాడర్‌ చేజారకు ం డా జాగ్రత్తలు తీసుకోవాలని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.    తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ సైతం బో టాబోటి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పరిస్థితి కుడి, ఎడమైతే సర్కార్‌కు ఎలాంటి ముప్పు ఉండకూడదన్న వ్యూ హంతోనే ఎంఐఎంతోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ను టిఆర్‌ఎస్‌ నాయకత్వం కోరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజ కీయ పరిస్థితి ఇలావుంటే వచ్చే ఐదేళ్లకాలంలో తాము బలపడ్డాలని టి కాంగ్రెస్‌ నాయకత్వం ఒంటరి పోరు సాగిస్తుండగా, టిడిపి, బిజెపి కూట మి సైతం పడరాని పాట్లు పడుతున్నాయి. దీంతో మున్ముందు ఓటరు తీ ర్పు వల్ల టి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు ఆస్కారం ఏర్పడినా ఆశ్చర్య పొనక్కర్లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉంది. ఖమ్మం జిల్లా లోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లభించింది. మున్ముందు తె లంగాణలోని సెటిలర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సా రించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. తద్వారా కనీసం రెండు డిజిట్ల సీట్లను సాధించాలని ఆ పార్టీ సమాలోచనలు చేస్తోంది. అప్పుడు మున్ముందు టిలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే తమ పార్టీ ఎ మ్మెల్యేల బలం ప్రభుత్వాలకు అవకాశం ఉంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజార్టీ రాకపోవచ్చన్న అంచనాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకత్వం వస్తోంది. అప్పుడు సంకీర్ణంలో తాము కీ రోల్‌ ప్లే చేయవచ్చన్న అభిప్రాయంతో ఆ పార్టీ యోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: