తను చెప్పింది ఏమిటో మరిచిపోయి... పూర్తిగా సింగపూర్ ట్రాన్స్ లో పడిపోయాడు తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమన్నా అంటే... మాటకు ముందఉ ఒకసారి సింగపూర్ అంటారు, మాటకు తర్వాత ఒక సారి సింగపూర్ అంటారు. ఏపీ రాజధాని నిర్మాణం పేరుతో.. కేవలం సింగపూర్ గురించి చెప్పడమే ప్రభుత్వ పెద్దకు పని అయిపోతోంది. అసలు మనం ఏమిటి? ఎక్కడున్నాం? మన ప్రజలు ఏం కోరుకొంటున్నారు? అనే విషయాలు ఆయన మరిచిపోతున్నారు. ఒకవైపు బాబు సింగపూర్ సహకారంతో మరో సింగపూర్ ను కట్టే పనిలో ఉన్నారు. అయితే.. జనాలు మాత్రం రుణమాఫీల గురించి, ఇతర సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నారు. తమకు సింగపూర్ తో పనిలేదు.. తమకు చెప్పినవి చేస్తే చాలని వారు భావిస్తున్నారు. రుణమాఫీ గురించి రైతులకు ఇప్పటి వరకూ దిక్కతోచటం లేదు. ఏడాదికి 20 శాతం చొప్పున రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు... ఆ మేరకు అయినా రుణమాఫీ జరుగుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆ వ్యవహారం పై అతీగతీ లేదు. ప్రభుత్వం ఇంత వరకూ రుణమాఫీకి కేటాయించింది కేవలం ఐదంటే ఐదు వేల కోట్ల రూపాయలే. అది కూడా ఖాతాలో జమ అయ్యింది లేదు. వార్షిక ప్రణాళికలో రుణమాఫీకి ఐదు వేల కోట్ల రూపాయలు అని ఒక మాట అన్నారు! మరి ఆ ఐదు వేల కోట్ల రూపాయలు.. వడ్డీలకు కూడా సరిపోవని.. ఏడాదికి వచ్చే వడ్డీనే పదిహేడు వేల కోట్ల రూపాయల వరకూ ఉందని.. కాబట్టి.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేస్తున్న చేష్టలకూ ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం అవుతోంది. మరోవైపు రైతులు రుణమాఫీ అవుతుందనే ఆశతో.. రెన్యువల్స్ ఆపి కూర్చొన్నారు! ఇలాంటి స్థితిలో రోజులు గడిచే కొద్దీ వ్యవహారం రసాభసగా మారుతుంది. మరి ఆ స్థితిని తెలుగుదేశాధినేత ఈ విధంగా పరిష్కరిస్తారో చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: