ఐసీసీ చైర్మన్ హోదాలో ఉన్న ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అనే విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసులో విచారణకు హాజరు అయ్యే ప్రముఖ వ్యాపారవేత్తల్లో శ్రీనివాసన్ కూడా ఒకరు. అయినప్పటికీ శ్రీనివాసన్ ఎక్కడా జగన్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. తనపై జగన్ ఎలాంటి ఒత్తిడి చేయలేదని శ్రీనివాసన్ సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంటే.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై విచారణ జరిపిన ముద్గల్ కమిటీ చెన్నై సూపర్ కింగ్స్ యజామాని అయిన శ్రీనివాసన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనకూ స్పాట్ ఫిక్సింగ్ కు, బెట్టింగ్ లకు ఎలాంటి సంబంధం లేదని ఆ కమిటీ స్పష్టం చేసింది. శ్రీనివాసన్ ది ఎలాంటి తప్పులేదని.. ఆ కమిటీ తేల్చింది. దీంతో ఆయనకు చాలా రిలీఫ్ దొరికింది! ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ హోదాలో ఉన్న శ్రీనివాసన్ కు ఇంతకన్నా రిలీఫ్ ఉండదేమో. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీనివాసన్ అల్లుడు మొయ్యప్పన్ పేరు వినిపించడంతో శ్రీనివాసన బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు మొయ్యప్పన్ కూడా స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో శ్రీనివాసన్ నిర్ధోషి అయ్యాడు. అయితే మొయ్యప్పన్ బెట్టింగులు వేశాడని మాత్రం కమిటీ నిర్దారించింది. అతడు ఐపీఎల్ జట్లపై బెట్టింగులు కశాడని.. పేర్కొంది. మరి బీసీసీఐ చట్టాల ప్రకారం జట్ల యజమానుల హోదాలో ఉన్న వారు ఇలాంటి బెట్టింగులు వేయడం కూడా నేరమే! ఇలాంటి సందర్భాల్లో ఆయా జట్ల సభ్యత్వాలను రద్దు చేయవచ్చు. మరి మొయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారం చెన్నై సూపర్ కింగ్స్ భవితవ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: