ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టిన పదమూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ శాసనసభ సస్పెండ్ చేసింది.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనైతికంగా టిఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మదుసూదనాచారి పోడియం ను చుట్టుముట్టారు.సోమవారం నాడు సభను స్తంభింప చేసిన కాంగ్రెస్ ఈ రోజు కూడా అదే రీతిలో ఆందోళన కొనసాగించింది.పలుమార్లు దీనిపై వాదోపవాదాలు సాగినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాంతించలేదు.దాంతో విపక్ష నేత జానారెడ్డి మినహా మిగిలిన పదమూడు మందిని సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానం పెట్టగా ఆమోదించారు. సస్పెండ్ అయినవారిలో డికె అరుణ, పద్మావతి, భాస్కరావు,భట్టి విక్రమార్క,రామిరెడ్డి వెంకటరెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి,గీతారెడ్డి,కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు.వీరిని ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. ఇంతకుముందు టిడిపిసభ్యులను ఏడు రోజులపాటు సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కరోజే సస్పెండ్ చేశారు.కాగా కెసిఆర్ సభ జరుగుతున్న సమయంలో బయట విధానపరమైన ప్రకటనలు చేస్తున్నారంటూ బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు సభా హక్కుల ఉల్లంఘన ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: