కర్నూలు వరదల సమయంలో రాష్ట్రం చాలా దుర్భరమైన స్థితిలో ఉంది. అప్పుడప్పుడే వైఎస్ మరణించాడు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ప్రారంభం అయ్యింది అప్పుడే.రోశయ్య ఇంకా కుదురుకోలేదు. వెంటనే కర్నూలు బీభత్సమైన వరదలను ఎదుర్కొంది. అప్పుడు బాధితులను ఆదుకోవడం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే పేరు వచ్చింది. అనేక మంది ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది. మరి అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వరదబాధితులకు ఇంటికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బు పంచిందట. తక్షణ సాయం కింద వారందరికీ ప్రభుత్వం ఆ డబ్బును ఇచ్చిందని తెలుస్తోంది. మరి అప్పుడు ఆ మాత్రం సాయమై నా అందితే.. పటిష్టమైన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా సంభవించిన విశాఖ తుపాను బాధితులకు మాత్రం సహాయం అందడం లేదని తెలుస్తోంది! హుదూద్ తుపాను విశాఖను అతలాకుతలం చేసి వెళ్లి నెల గడిచినా.. ఇప్పటి వరకూ తక్షణ సాయం కింద ఎవరికీ సహాయం అందలేదని తెలుస్తోంది. ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించలేదని సమాచారం. అదేంటి అంటే.. వాళ్లకు బ్యాంకు ఖాతాలు లేవు, బ్యాంకు ఖాతాలు ఉన్న వారికే సహాయం.. అని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతుండటం విడ్డూరంగా మారింది! మరి తుపాను సమయంలో కూడా రేషన్ కార్డు ఉంటేనే బియ్యం ఇస్తాం.. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు ఉంటేనే సహాయం చేస్తాం? అని అంటే ఎలా?! అలాంటి నియమాలు మంచివే. అయితే కొన్ని సార్లు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తుండాలి. లేకపోతే ప్రభుత్వం బాధితుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తోంది. మొత్తానికి సమర్థుడిని అని చెప్పుకొనే బాబు ప్రభుత్వం కన్నా.. కాంగ్రెస్ వాళ్లే మేలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు!

మరింత సమాచారం తెలుసుకోండి: