రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబుకు పని రాక్షసుడిగా మంచి పేరుంది. తాను నిద్రపోరు.. మిగిలినవారిని పోనివ్వరని అంటుంటారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా.. చంద్రబాబులోని ఆ గుణంలో మాత్రం ఏ మార్పులేదు. అసలే విభజన కష్టాలు, కొత్త రాజధాని, హుదుద్ తుపాను వంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో తన స్పీడును మంత్రులు అందుకోలేకపోతున్నారని చంద్రబాబు ఫీలవుతున్నారు..                                            మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో చంద్రబాబు..కొందరు మంత్రుల పనితీరుపై మండిపడ్డారు. మీ పని తీరు చూస్తే ఫస్ట్రేషన్ కలుగుతోందంటూ ముఖం మీదే అనేశారట. శాఖలపై కనీస అవగాహన ఉండటం లేదని తలంటారట. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా ఎందుకు అమలుకావడంలేదని మంత్రులను చంద్రబాబు నిలదీశారట. ప్రత్యేకించి వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై సీఎం మండిపడ్డారట.                                        వ్యవసాయ శాఖకు సంబంధించిన సీఎం కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ప్రత్తిపాటి నుంచి సరైన సమాధానం రాకపోయేసరికి సీఎం ఒక్కసారిగా మండిపడ్డారట. శాఖలపై పట్టు సంపాదించుకోవాలని మంత్రులకు క్లాస్ పీకారట. ఆదర్శ రైతుల స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి చాలాకాలమవుతున్నా.. ఎందుకు అమలు కాలేదని ప్రత్తిపాటిని సీఎం నిలదీశారట. దీనిపై ఆయన ఏవో సాకులు చెప్పబోయే సరికి.. సీఎం మరోసారి ఫైరయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: