తెలంగాణలో సారాను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వంలో ఆలోచన జరుగుతోంది.దీనికి కారణం గ్రామాలలోను, పట్టణాలలోని కొన్నిచోట్ల గుడుంబా వినియోగం పెరిగిపోవడమేనని మంత్రివర్యులు పద్మారావు చెబుతున్నారు.దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే అనేక గ్రామాలలో సారా లేకపోవడం, మద్యం ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణులు గుడంబా వైపు ఆకర్షితులవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని అంటున్నారు.దీనిని అరికట్టడానికి సారా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు.1993 లో ఉమ్మడి రాష్ట్రంలో సారా వ్యతిరేక పోరాటం జరిగింది. మద్య నిషేధ ఉద్యమం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం సారాను నిషేధించింది. అప్పటి నుంచి అది అమలులో ఉంది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.ప్రభుత్వం మద్యాన్ని కూడా నిషేధించింది.కాని తదుపరి చంద్రబాబు ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఎత్తివేసింది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ లో కల్తీ సాపులను నిషేదించారు.కాని కెసిఆర్ ప్రభుత్వం కల్లు దుకాణాలను అనుమతించింది.ఇప్పుడు సారా నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: