ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ప్రతి విషయానికీ జ్యోతిష్యులు, ముహూర్తాలపై ఆధారపడుతున్నారని విమర్శలు పెరుగుతున్నాయి. మొదటి రెండు విడతల్లో జ్యోతిష్యంపై అంతగా ఆధారపడని చంద్రబాబు.. మూడో విడతలో మాత్రం అడుగడుగునా.. వాస్తు, జ్యోతిష్యాల పట్టింపు ఎక్కువైందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకార సమయంలో తర్జనభర్జలకు గురవడం, శ్రీరామ అవదూత స్వామిని కలవడం, లేక్ వ్యూ అతిధి గృహంలో ప్రవేశం సమయంలో ముహూర్తాలు.. ఇలా ప్రతివిషయంలోనూ బాబుకు పట్టింపులు ఎక్కువవుతున్నాయి.                             తాజాగా.. గుంటూరు జిల్లాలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరపాలని సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రయత్నిస్తున్నా.. చంద్రబాబు మాత్రం సుముఖంగా లేరు. ఇందుకు కూడా వాస్తు, జ్యోతిష్యం ప్రభావమే ఉందని తెలుస్తోంది. జ్యోతిష్కులు కొందరు నాగార్జున యూనివర్శిటీలోకి వెళితే నష్టం జరుగుతుందని చెప్పడం వల్లనే.. అక్కడ అసెంబ్లీ సమావేశాలు వద్దని బాబు చెబుతున్నారట.                                      గతంలో ఆ యూనివర్శిటీకి వెళ్లిన కొందరు రాజకీయ నేతలు ఆ తర్వాత ఇబ్బంది పడ్డారని బాబు అనుచరులు గుర్తు చేస్తున్నారు. అందుకే చంద్రబాబు అసలు నాగార్జున యూనివర్శిటీ వంకే చూడడం లేదని అంటున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా.. యూనివర్శిటీ అతిధి గృహాన్ని చంద్రబాబుకు విశ్రాంతి మందిరంగా అధికారులు ఎంపిక చేసినా చంద్రబాబు ఒప్పుకోకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.                             అంతేకాదు.. రాజధాని భూసేకరణలోనూ చంద్రబాబు వాస్తు కోణంలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కృష్ణానది పక్కన ఉన్న సారవంతమైన భూములను రాజధానికోసం తీసుకోరాదని కొందరు రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు. చంద్రబాబు వాస్తు కోణంతో వారి విజ్ఞప్తిని తిరస్కరించారట. వాస్తు ప్రకారం.. ఆ భూములు రాజధానిలో ఉండాల్సిందేనని.. ఆయన స్పష్టం చేశారట. హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్న నాయుడుగారు ఇప్పుడిలా ప్రతి విషయంలోనూ జ్యోతిష్యం, వాస్తు అంటూ పట్టించుకోడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: