తెలంగాణలో మద్యం విక్రయాలు తగ్గాయట. దానికి పలు కారణాలు చెబుతున్నారు.ప్రధానంగా విభజన వల్ల మద్యం విక్రయాలు కొంత తగ్గుముఖం పట్టాయని అదికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ మద్యం డీలర్ల సంఘం అద్యక్షుడు డి. వెంకటేశ్వరరావు దీనిపై మాట్లాడుతూ సుమారు ఇరవై ఐదు శాతం మేర మద్యం అమ్మకాలు గత నాలుగైదు నెలల్లో పడిపోయాయని అన్నారు.విభజన కారణంగా ఎపి లోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వచ్చే సందర్శకులు తగ్గారని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ జిల్లాలలో ఉన్న మాంద్య పరిస్థితి కూడా తోడైందని అంటున్నారు.కాగా కొన్ని రకాల ప్రత్యేక మద్యం బ్రాండ్లు కూడా కొరత ఉండడం కూడా కారణంగా చెబుతున్నారు.తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంతోష్ రెడ్డి కూడా ఈ విషయాన్ని దృవీకరించారు.సాధారణంగా అక్టోబర్ లో అమ్ముడు బోయే స్థాయిలో అమ్మకాలు లేవని, డీలర్లు , స్టాక్స్ ను తరలించడానికి పెద్దగా ముందుకు రావడం లేదని అన్నారు.మొత్తం మీద విభజన ప్రభావం ఈ రకంగా కూడా ఉందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: