మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండానే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి అయిపోయాడు నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానంలో ప్రత్యేక పాత్ర వహించి.. ఆది నుంచి కేసీఆర్ తోనే కలిసి సాగిన నర్సింహారెడ్డిని కేసీఆర్ ఆ విధంగా గౌరవించాడు. మరి ఆ విధంగా టీఆర్ఎస్ లో తన స్థానం ఏమిటో చాటుకొన్న నాయినికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఆయన ఒక యూనియన్ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఎదురుదెబ్బ తిన్నాడు! మెదక్ జిల్లాలోని జిన్నారం మండలంలోని ఒక పారిశ్రమలో యూనియన్ ఎలక్షన్స్ లో పోటీ చేసి నాయిని నర్సింహారెడ్డి ఓటమి పాలయ్యాడు. గౌరవాధ్యక్ష స్థానం లాంటి ఎన్నికలో గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటాలని చూసిన మంత్రిగారికి షాక్ ఇచ్చే రిజల్ట్స్ వచ్చాయి అక్కడ. యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములు విజయంసాధించాడు. మొత్తం 171 ఓట్లు ఉన్న యూనియన్ లో 168 ఓట్లు పోలయ్యాయి. వాటిల్లో నాయినికి కేవలం 68 ఓట్లు మాత్రమే వచ్చాయి. వంద ఓట్లను పొందిన రాములు యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. మరి అధికార పార్టీ వ్యక్తి.. రాష్ట్ర హోం మంత్రి ఈ విధంగా యూనియన్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం విశేషమేనని చెప్పవచ్చు. ఎంతో అనుకూల పరిస్థితి ఉందనుకొంటే తప్ప నాయిని ఇక్కడ పోటీ చేసి ఉండకపోవచ్చు! మరి తెలంగాణ రాకముందు చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేశారు. విజయంసాధించి తెలంగాణ స్ఫూర్తిని చాటామన్నారు. అయితే తీరా తెలంగాణ వచ్చాకా ఏకంగా నాయిని వంటి బిగ్ షాట్ ఓటమి పాలవ్వడం విశేషమే కదా! ఇది టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బేనని అనుకోవాలా?!

మరింత సమాచారం తెలుసుకోండి: