గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మైండ్ స్పేస్ పేరుతో రహేజా కంపెనీకి 110 ఎకరాలను కేటాయించారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. వారసత్వ సంపద ఉందంటూ ఇప్పుడు టిడిపి వారు ఆరోపణలు చేస్తున్నారని , కాని అదే పార్టీ ఆ రోజులలో వారసత్వ సంపద ఉన్న భూములుగా ఉన్న గుర్తించిన చోట ఆ ప్రభుత్వం రకరకాల కంపెనీలకు బూమి ఇచ్చిందని అన్నారు.ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేసినవారు క్షమాపణ చెప్పాకే సభలో చర్చలో పాల్గొనాలని కోరుతున్నానని అన్నారు.ఓర్వలేని తనంతో ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాగా ఆ తర్వాత తిరిగి టిఆర్ఎస్ సబ్యులు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విశేషం. ఎపి ప్రభుత్వం విద్యుత్ తెలంగాణకు ఇవ్వవలసిన వాటా ఇవ్వలేదని కెసిఆర్ చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఒక పత్రం చూపి ఎపి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఒక అసత్యమైన పేపర్ ను తీసుకు వచ్చి తెలంగాణకు నష్టం చేశారని ఆయన అన్నారు. దీనిపై కోర్టుకు వెళుతున్న తరుణంలో ఆ సభ్యుడి వాదన పొరుగు రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు రేవంత్ ఆ పత్రం ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పిన తర్వాతే సభలో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: