తెలంగాణలో ఇంత వరకూ ప్రతిపక్షంగా తన సత్తా చూపలేకపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొంది. ప్రత్యేకంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. కేసీఆర్ పాలనకూ ఆంద్రాలో చంద్రబాబు సాగిస్తున్న పాలనకూ తేడా ఏమీ లేదని పొంగులేటి స్పష్టం చేశాడు. ఒకవైపు కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు రాష్ట్రాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని పొంగులేటి వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వలసలను ప్రోత్సహించడంలో బిజీగా ఉందని.. ఇతర పార్టీ లనుంచి నేతలను ఆకర్షించడమే ప్రభుత్వాధినేతలకు పని అయ్యిందని పొంగులేటి అభిప్రాయపడ్డాడు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని.. రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తన్నామని ఆయన అన్నాడు. తామేదో ప్రతిపక్షంలో ఉన్నామని విమర్శలు చేయడం లేదని... ఒకవేళ ప్రభుత్వం మంచి చేస్తే... సెల్యూట్ చేసే వాళ్లలో తామే ముందుంటామని పొంగులేటి అన్నాడు. మొత్తానికి ఈ విధంగా తెలంగాణలో కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నామన్న ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడిప్పుడే ఈ ప్రయత్నాలు మొదలయినట్టుగా ఉన్నాయి. మరి ఈ ప్రస్థానం ఎలా ఉంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: