గత సార్వత్రిక ఎన్నికల్లో పొ త్తుతో ఎన్నికలకు వెళ్లిన టిడిపి, బిజెపి పార్టీల మధ్య ము న్ముందు సఖ్యత కొనసాగుతుందా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ప్రస్తుతం కేంద్రంలో,ఏపి రాష్ట్ర ప్రభు త్వాలలో టిడిపి, బిజెపిలు భాగస్వాములుగా కొనసాగుతు న్నాయి. కానీ ఉత్తరాధిన పాగా వేసిన బిజెపి నాయకత్వం దక్షణాధిని బలపడేందుకు ఉబలాట పడుతోంది. ఈ నేప థ్యంలో మరీ ముఖ్యంగా తమిళనాడు, ఏపి, తెలంగాణల పై ఆ పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ క్రమ ంలో తమిళనాడులో సినీస్టార్‌ రజినీకాంత్‌ను తన పార్టీలో కిలాగాలని చూస్తోంది. అదే తరహాలో ఏపిలోనూ బలమైన నేతలను తన పక్కనచేర్చుకొనేందుకు సమాలోచనలు చే స్తోంది.  ఇప్పటికీ ఏపి కాంగ్రెస్‌లో ఇంకా మిగిలి ఉన్న ఆ పార్టీ సీనియర్లకు బిజెపి గాళం వేస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీలోనుంచి వచ్చే బలమైన నేతలకు గాళం వేసేం దుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఏపిలో క్ర మంగా తాను విస్తరించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ ప రిణామాలన్ని టిడిపి నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తు తం బిజెపి చేర్చుకొంటున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఒక ప్పుడు తమకు స్థానికంగా బలమైన పోటీ ఇచ్చిన నేతలు కావడంతో మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవా అన్న గుబులు తెలుగు తమ్ముళ్లలో మొదలైంది. మరోవైపు భవి ష్యత్‌ అవసరాలే లక్ష్యంగా బిజెపి దక్షణాధిలో విస్తరించేం దుకు పావులు కదుపుతోంది. ఈ పరిణామాలు మున్ముం దు టిడిపి, బిజెపి సత్‌ సంబంధాలపై ప్రభావం చూపెడు తుందన్న విషయాన్ని ఇరు పార్టీలకు చెందిన నేతలు కాద ని చెప్పలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: