పులివెందుల నుండి ఢిల్లీకి తరలిస్తున్న ఎర్ర చందనం వాహనాన్ని గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ దగ్గర అన్నాసాగర్ పొలీసులు పట్టుకున్నారు. లారీలొపల పైన అరటి పండ్లు ఉంచి లోపల మాత్రం ఎర్ర చందనంను తరలిస్తున్నారని ముందుగా ఎస్పీ విశ్వప్రసాద్‌కు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు అన్నాసాగర్ పోలీసులు నిఘా పెట్టి ఎంహెచ్ 31సిక్యూ 2837 నంబర్ గల లారీని పట్టుకున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియ జేయడంతో ఫారెస్ట్ సెక్షన్ అధికారి కృష్ణయ్య భూత్పూర్‌కు చేరుకుని పట్టుబడ్డ ఎర్ర చందనం విలువ రూ 50 లక్షలకు పైగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకుని పట్టుబడ్డ లారీని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ముందుగా జిల్లా ఎస్పీకి సమాచారం అందడంతో ఆయన జడ్చర్ల రూరల్ సిఐ గిరిబాబు, అన్నాసాగర్ ఎస్సై లక్ష్మారెడ్డిలకు సమాచారం ఇవ్వడంతో లారీని పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: