పిన్ను నుంచి పడుకునే బెడ్ వరకు..కాళ్ల చెప్పుల నుంచి కళ్లద్దాల వరకు…మిక్సీ టు మిషన్స్…. ఇప్పుడు ఏదైనా ఆన్ లైన్ లోనే…. అమ్మాలన్నా..కొనాలన్నా..ఈ కామర్సే. ప్రస్తుతం ఇండియాలో ఆన్ లైన్ మార్కెట్ ఊపేస్తుంది. రెండేళ్లలో 90వేల కోట్లకు చేరుకోనుంది. ఒక్క క్లిక్ తో కావాల్సిన వస్తువును సొంతం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగోంది. కొనుగోళ్లు, అమ్మకాలు ఏదైనా సరే ఇప్పుడూ అన్ని ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. దీంతో రెండేళ్లలో ఆన్ లైన్ మార్కెట్ 90వేల కోట్లకు చేరుకోనుందని గూగుల్ అంచనా వేస్తోంది. దాదాపు 10 కోట్ల మంది షాపింగ్ కు ఆన్ లైన్ మార్గాన్ని ఎంచుకోవచ్చంటుంది. ఇంటర్ నెట్ వాడకం రోజు రోజుకు పెరుగుతుండటంతో..ఈ షాపింగ్ వైపు ఎడిక్ట్ అవుతున్నారు ఇండియన్స్. 2012లో ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య 80 లక్షలు ఉండగా..ప్రస్తుతం 3.5 కోట్లకు చేరుకుంది. కాళ్లకు వేసుకునే చెప్పుల నుంచి..ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రతిది..ఆన్ లైన్ స్టోర్ ద్వారానే కొనేందుకు ఇష్టపడుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఈ ఏడాది చివరి కల్లా దేశంలో ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య 30.2 కోట్లకు చేరుకోనుంది. అమెరికాను వెనక్కి నెట్టి భారత్ సెకండ్ ప్లేస్ కు చేరుకోనుందని గూగుల్ సర్వే తెలిపింది. ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ రెండేళ్లలో ఐదు రెట్లు కానుంది. అందులో 40 శాతం మహిళలే ఉంటారని గూగుల్ సర్వే అంచనా వేస్తుంది. మగవారితో పోలిస్తే.. ఆడవాళ్లు ఆన్ లైన్ మార్కెట్ చేయడంలో రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తెలిపింది. మరోవైపు ప్రపంచ జనాభాలో మొబైల్ వాడేవారు కూడా అంతకంత పెరగనున్నారు. 2020 కల్లా.. 90శాతం జనాభా మొబైల్స్ వాడనున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ లో తెలింది. అలాగే ప్రస్తుతం 270 కోట్లుగా ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య 610 కోట్లకు చేరుకోనుంది. మొత్తానికి ఇంటర్ నెట్ తో పాటు..స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరగటంతో…ఇండియాలో ఆన్ లైన్ బిజినెస్ కు ఫుల్ గిరాకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: