భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు ఆసక్తికరంగా, ఒకింత విశేషంగా ఉంది. తమ పార్టీని తప్ప అన్ని పార్టీలనూ కుటుంబ పార్టీలుగా అభివర్ణించాడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ.. ఇవన్నీ కుటుంబ పార్టీలే అని కిషన్ రెడ్డి అన్నాడు. అంటే ఆ పార్టీల్లో ముఖ్య పోస్టుల్లో ఉన్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో కిషన్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేశాడని చెప్పవచ్చు. మరి కాంగ్రెస్ , టీఆర్ఎస్ లను కిషన్ రెడ్డి విమర్శించడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే బీజేపీకి అవి వైరి పక్షాలు కాబట్టి.. కిషన్ వాళ్లను విమర్శించి ఉండవచ్చు. అయితే ఈయన కుటుంబ పార్టీగా అభివర్ణించిన జాబితాలో టీడీపీ కూడా ఉంది. టీడీపీని కూడా ఆయన కుటుంబ పార్టీ అని విమర్శించాడు. మరి అదే టీడీపీ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కూడా. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ లు మిత్రపక్షాలుగా ఉన్నాయి. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి టీడీపీని విమర్శించడం విడ్డూరమే అవుతుంది. ఒకవైపు ఆ పార్టీతో పొత్తుతో ఉండి.. మళ్లీ ఆ పార్టీ నే విమర్శించడం ఏమిటో మరి. ఒకవేళ టీడీపీ కుటుంబ పార్టీనే అయితే.. ఆ విధానాలను భారతీయ జనతా పార్టీ బరించలేకపోతే.. నిక్షేపంగా ఆ పార్టీకి తలాక్ చెప్పేయవచ్చు కదా! ఒకవైపు అవసరాలకు దగ్గర అవుతూ... ఇలా మాట్లాడటం ఏ మేరకు సబబు?!

మరింత సమాచారం తెలుసుకోండి: