టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తిలాంటింది. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు.. మెడ కోసుకోవచ్చు.. లేదా వేరేవాడిని హత్య చేయొచ్చు. ఉపకరం వాడే వాడిపై దాని ఉపయోగం ఆధారపడి ఉంటుంది. ఇంటర్ నెట్ కూడా అంతే. సమాచార సేకరణ కోసం.. సామాజిక సంబంధాల పునరుద్దరణ కోసం.. ఆధునిక విద్య కోసం ఉపయోగించాల్సిన ఇంటర్ నెట్ ఉపయోగం కంటే దుర్వినియోగమే ఎక్కువగా అవుతోంది. ప్రత్యేకించి యువత దీన్ని నీలి చిత్రాల అడ్డాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి.                                                       ఇంటర్ నెట్లో బూతు చిత్రాలను చూసే విషయంలో ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగుకుర్రాళ్లే కాస్త బుద్దిమంతులట. తాజాగా ఓ అతిపెద్ద బూతు వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ వెబ్ సైట్ తనకు వస్తున్న రద్దీని విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా సగటున కుర్రాళ్లు రోజులో దాదాపు 9 నిమిషాలు నెట్లో బూతు చిత్రాలు చూస్తున్నారట. ఇండియా విషయానికి వస్తే.. ఎనిమిదిన్నర నిమిషాలు చూస్తూ భారత యువత ప్రపంచ సగటుకు దగ్గర్లోనే ఉంది.                                      ఇండియాలోని రాష్ట్రాల విషయానికి వస్తే.. ఉత్తరాది కుర్రాళ్లు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా 10 నుంచి 12 నిమిషాలు బూతు చిత్రాలు చూస్తున్నారట. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళలోని కుర్రాళ్లు మాత్రం కేవలం 5 నిమిషాలు మాత్రమే చూస్తూ కాస్త బుద్దిమంతులనిపించుకుంటున్నారు. ఫారిన్లో బూతు వెబ్ సైట్లకు శనివారం ఎక్కువ రష్ ఉంటే.. ఇండియాలో మాత్రం శనివారం యూత్ ఆ మూడ్లోకి వెళ్తున్నారట. పండుగ రోజుల్లో మాత్రం మనోళ్లు ఈ సైట్ల జోలికి వెళ్లడం లేదట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇండియా కుర్రోళ్లు ఎక్కువగా సెర్చ్ చేసింది సన్నీలియోన్ కోసమేనంట.

మరింత సమాచారం తెలుసుకోండి: