దేశంలోని ధనికులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచి స్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, హర్షించకపోయినా దేశ శ్రేయస్సు దృష్ట్యా అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉన్నత స్థాయి లో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా సులువుగా పరిష్కారమవుతుందన్నారు. బొగ్గు గనులు, డీజిల్, గ్యాస్ ధరలు, తదితర సమస్యలపై గత ప్రభుత్వాలు వీటిపై ఏళ్లు వృథా చేశాయని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: