అత్యవసర సమయాలలో ప్రజల ప్రాణాలను కాపాడే `108' అంబు ెన్‌‌సల పరిస్థితి రోజురోజుకూ దిగజా రుతున్నది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాషా్టల్రలో ఈ వాహనా లు కదలలేని దుస్థితికి చేరుకుంటు న్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రాణాపాయ పరిస్థితులలో బాధితులు ఫోన్‌ చేసిన వెంటనే క్షణాలలో ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన వాహనాలు ఎప్పుడు చేరుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఉమ్మడి రాష్ట్రంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్ వాహనాలకు రూపకల్పన చేశారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా కాల్‌ సెంటర్‌కు ఫోను వచ్చిన వెంటనే సమీపంలోని సిబ్బంది అప్రమత్తమై దగ్గరలోని ఆసుపత్రికి తరలించడం ఈ పథకం ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడటం రెండు రాషా్టల్రలనూ ప్రభుత్వాలు వీటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈ పథకం ప్రజలకు అంతగా ఉపయోపడని స్థితికి చేరుకుంది. రెండు రాష్ట్రాలలో 108 అంబులెన్‌‌స వాహనాలు దీన స్థితిలో ఉండగా కారణాలు మాత్రం వేర్వేరుగా ఉండటం గమనార్హం. తెలంగాణలో ఉన్న దాదాపు 400కు పైగా వాహనాలు డీజిల్‌ కొరతతో సతమతమవుతున్నాయి. వాహనాలకు అవసరమైన ఇంధన అందుబాటులో లేకపోవడంతో చాలా వరకు షెడ్లకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు వాహనాలలో అత్యవసర పరిస్థితులలో అందజేసే ఫస్‌‌ట ఎయిడ్‌ పరికరాలు కూడా అందుబాటులో లేవు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స చేయడానికి అవసరమైన ట్రమడాల్‌ హైడ్రోక్లోరైడ్‌ ఇంజక్షన్‌, థియోపైలిన్‌ వంటి ఇంజక్షన్లు అందుబాటులో లేకపోవడంతో రోగిని ఆసుపత్రికి తరలించే వరకూ ఎదురు చూడాల్సి వస్తున్నది. గాయపడ్డ రోగిని అంబులెన్‌‌సలోనికి తరలించేందుకు, ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు కీలకమైన స్ట్రెచర్‌ వంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బాధితులు వేదనకు గురవుతున్నారు.  ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరో విధంగా ఉంది. ఇక్కడ మొత్తం 436 వాహనాలు ఉండగా, వీటిలో 300కు పైగా వాహనాలు దాదాపు 4 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. వాహనాల నిబంధలన ప్రకారం 2 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగితే వాటి స్థానంలో కొత్త వాటిని ఉపయోగించాలి. లేదా „వాటికి పూర్తి స్థాయి మరమ్మత్తులు నిర్వహించాలి. ఇవన్నీ ఏ క్షణంలోనైనా ఆగిపోయే దుస్థితికి చేరుకున్నాయి. కొద్ది నెలలుగా పాత వాటికి మరమ్మత్తులు నిర్వహించకపోవడంతో వాటి టైర్లు అరిగి మధ్యలోనే ఆగిపోతున్నాయి. గిరిజన, కొండ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక చోట గానీ వాహనాలు అందుబాటులో లేవు. ఇవి కూడా బాధితునికి సాయపడాలంటే ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో 150 కొత్త వాహనాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపినట్లు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో వాహనానికి రూ. 11 లక్షల వ్యయం కానుండగా, ఇందుకు సుమారు రూ. 16.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అత్యవసర టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను సైతం కొనుగోలు చేసేందుకు రూ. 6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అంచనాలు రూపొందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే అవసరమైన వాహనాలకు మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తామని పేర్కొంటున్నారు. చిన్న చిన్న సమస్యలున్న వాహనాలను వెంటనే సరిచేసి బాధితులను గతంలో మాదిరిగానే ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పార

మరింత సమాచారం తెలుసుకోండి: