మన రాష్ట్రం పరిస్థితి ఏమిటో సరిగా చూడండి...చెప్పిన హామీలను అమలు పరచండి.. ఇక్కడి ప్రజల బాగోగులను సరిగా చూసుకోండి... అని అంటే.. కొంతమంది ఏపీ ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ తో కయ్యానికి రెడీ అయిపోతున్నారు. మాటెత్తితే చాలు వీళ్లు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఏదో ఒకరో ఇద్దరో ఈ బాధ్యతల్లో ఉన్నారంటే పర్వాలేదు కానీ... ఏపీలోని ప్రభుత్వ పెద్దలు అనేక మంది దీన్నే పనిగా పెట్టుకొంటున్నారు! ఇప్పటికే కేసీఆర్ ను విమర్శించడం పనిగా పెట్టుకొనే తెలుగుదేశం నేతలు ఎక్కువమంది అయ్యారు. ఏపీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడం కాకుండా... వీళ్లు కేసీఆర్ తమను ఇబ్బంది పెట్టేస్తన్నాడని అంటున్నారు. మరి ఈ బాధ్యతల్లో ఒకరో ఇద్దరో ఉంటే బావుండేది. కానీ అందరూ ఇదే పని మీద ఉంటున్నారు. దీంతో మొదటికే మోసం వస్తోంది! ఒకవైపు కేసీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. ఈయన తెలంగాణ సమస్యలను పరిష్కరించకుండా... అయినదానికీ కాని దానికి ఆంధ్రా లీడర్లను విమర్శిస్తూ కూర్చొంటున్నాడని. అన్ని సమస్యలకూ వాళ్లనే కారణమని చూపుతున్నాడని కేసీఆర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. మరి కేసీఆర్ మాత్రమే కాకుండా ఏపీ లీడర్లు కూడా ఇదే పనిచేస్తున్నారు. తాజాగా పల్లె రఘునాథరెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు. ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుమ్మెత్తిపోశాడు. కేసీఆర్ కు చట్టాలపై నమ్మకం లేదని.. ఆయన చట్టాలకు విలువనివ్వడం లేదని రఘునాథరెడ్డి అభిప్రాయపడ్డాడు. మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తరపు నుంచి చాలా మంది ఇలా కేసీఆర్ పై రెచ్చిపోతున్నారనుకొంటే.. వాళ్లకు తోడు పల్లె కూడా రెడీ అయ్యాడు. ఓవరాల్ గా ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటూ కాలం గడుపుతున్నాయనమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: