తెలంగాణలో పూర్తిగా విద్యుత్ కోతలు ఎత్తి వేశారు.కొద్ది రోజుల క్రితం వరకు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉపశమనం పొందుతోంది.కొద్ది రోజుల క్రితం వరకు ఉన్న విద్యుత్ డిమాండ్ లో ఏభై మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ తగ్గడంతో ప్రభుత్వం ఇబ్బంది నుంచి బయటపడింది.పరిశ్రమలకు పవర్ హాలిడేని కూడా ఎత్తివేశారు.ఖరీప్ సీజన్ లో వ్యవసాయ రంగానికి విద్యుత్ సమస్య తీవ్రం కావడం, పలుచోట్ల పంటలు ఎండిపోతున్నట్లు రైతులు ఆందోళనకు దిగడం జరిగింది.అప్పట్లో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే ముందు జాగ్రత్తగా రబీలో వరి పంటను వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని , వరికి ఉచిత విద‌్యుత్ ఇవ్వబోమని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.ఈ నేపధ్యంలో రానున్న వేసవిలో ఉండే విద్యుత్ సమస్యను ముందుగానే అంచనా వేసుకుని అందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దపడితే మంచిది.పరిశ్రమలకు,వ్యాపారాలకు,నివాసాలకు ,గ్రామాలకు కూడా విద్యుత్ కోత ఎత్తివేసినట్లు ట్రాన్స్ ఎమ్.డి ప్రభాకరరావు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: