కృష్ణా.. గోదా వరి తదితరప్రధాన నదుల్లో నీటిప్రవాహా లు నిలిచిపోయాయి. మరోవైపు జలాశయా ల్లో నీటిమట్టాలు కూడా వేగంగా తరిగిపోతు న్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి రబీపంటలకు సాగునీరు ఎండమావులను తలపిస్తోంది. ప్రాజెక్టుల కింద సాగు చేసిన ఖరీఫ్‌ పంటలకు మరో రెండు వారాలదాక సాగునీటిని అందచేయా ల్సిన అవసరముం ది. ఈ పంటలను గట్టె క్కించుకునేందుకే జలాశయాల్లో నీటి నిలువలు చాలీచాలనంత గా ఉన్నాయంటున్నారు. ఇక రబీపంటల సాగుకు నీరెక్కడి నుంచి తేవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నీటిపారు దల శాఖల అధికారులు చెతులెత్తేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్యన కృష్ణాజలాల వినియోగంలో తలెత్తిన వివాదం ఢిల్లిసకి చేరింది. కేంద్రప్రభుత్వ జోక్యంతో ఆక్కడైనా ఈ వివాదం చల్లబడు తుందని ఆశించిన ఆధికార యంత్రాగానికి నిరాశే ఎదురైంది. కృష్ణానదిలో ఎగువ నుంచి నీటిప్రవాం పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయంలోకి ఇక చుక్కనీరు కూడా చేరే పరిస్థితి లేదంటున్నారు. శ్రీశైలం లో జలవిద్యుత్‌ను నిలిపివేయాలని కృష్ణా రివర్‌బోర్డు ఇచ్చిన ఆదేశాలు పెద్దగా ఫలితం చూపలేకపోయాయి. ఎడమగట్టు కాలువ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశా రు. అదే రోజున ఎడమగట్టు నుంచి ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని కొనసా గించి 25427క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయటంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854అడుగులకు పడిపోయింది. ఎగువన జూరాల నుంచి నీటిని విడుదల చేయటంతో శనివారం నాటికి తిరిగి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 855 అడుగులకు చేరింది. జలాశయం నుంచి శనివారం కూడా 8,244 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. అడపా దడపా విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తూనే జూరాల నుంచి నీటి విడుదలతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిమట్టాన్ని కవర్‌ చేస్తోందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకం, తెలుగుగంగ, కేసీ కాలువల కింద సాగుచేసిన పంటలను కాపాడుకోవాలంటే డిసెంబర్‌ దాక శ్రీశైలం జలాలను అందచే యాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇదివరకే కృష్టా రివర్‌ బోర్డుకు విన్నవించింది. అయితే జలాశయంలో 854 అడుగులకు పైన నీటిమట్టం ఉంటే తప్ప సీమ పథకాలకు తాగు, సాగునీరు అందచేసే పరిస్థితి లేదు.ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ, కేసీ కాలువలకు రబీలో సాగునీటిని అందిం చలే మని సాగునీటి సలహామండలి సమావేశంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. శ్రీశైలంలో ఉన్న కొద్దిపాటి నీటితో వేసవి తాగునీటి అవసరాకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమావేశలో అధికారులు తేల్చిచెప్పేశారు. మరోవైపు తెలంగాణలోనూ జలాశయాల్లో నీటినిలువలు అంత ఆశాజన కంగా లేవంటున్నారు. ఎగువ నుంచి గోదావరి నీటిప్రవాహం ఈ ఏడాది పూర్తి నిరాశ పరిచింది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 90టీంఎంసీలు కాగా, ఈ జలాశయంలో నీటినిలువలు 22టీఎంసీలకు మించటంలేదు. ఉన్న నీరు కూడా అరకొరగా సాగైన ఖరీఫ్‌ పంటలతోపాటు వేసవి తాగునీటి అవసరాలకే సరిపోతాయంటున్నారు. 17టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న నిజాంసాగర్‌లోనూ 1.66టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. సింగూరు జలాశయ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 29టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇందులో 11టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. 24టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న లోయర్‌ మానేరు జలాశయంలో కూడా నీటినిలువ 7టీఎంసీలకు మించి లేదు. ఈ పరిస్థితుల్లో వేసవి తాగునీటి అవసరాలే ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: