ఆ విషయంలో రాజీపడని చంద్రబాబు అండ్ కో..! ఒకవైపు విరాళాలు, హుండీల విషయంలో విమర్శలు వస్తున్నాయి. అయినా ఏపీ ప్రభుత్వం ఆ వ్యవహారంలో వెనక్కు తగ్గడం లేదు. వివిధ కారణాలు చూపుతూ విరాళాలను అయితే తీసుకొంటోంది. మరి ఇదే ప్రభుత్వానికి సంబంధించిన మరోపార్శ్వం కూడా హైలెట్ అవుతుండటం ఇక్కడ విశేషం. ఏపీ ప్రభుత్వం దుబారా ఖర్చుకు సంబంధించినది ఇది. హైదరాబాద్ ఏపీకి శాశ్వతమైనది కాదు. మరో పదిసంవత్సరాల తర్వాత హైదరాబాద్ పై ఏపీ గవర్నమెంటుకు ఎలాంటి హక్కులూ ఉండవు. మరి ఈ విషయంపై అవగాహన ఉండి కూడా ఏపీ ప్రభుత్వం ఇన్వస్ట్ చేయడానికి వెనుకాడకపోవడం విశేషం. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వ వాటాకి దక్కిన సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ ను రీమోడలింగ్ చేయించడానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే విషయం తెలిసిందే! మరి ఒకవైపు విజయవాడక అన్ని కార్యాలయాలనూ తరలిస్తామని.. కొత్త రాజధాని నిర్మాణమని అంటూనే.. ఇలా హైదరాబాద్ విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం కచ్చితంగా విడ్డూరమే. మరి ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి ఛాంబర్ ఓపెనింగ్ సందర్భంగా డెకరేషన్ కోసం ఖర్చు చేసిన డబ్బుకు సంబంధించి జీవో ఒకటివిడుదల అయ్యింది. అక్టోబర్ రెండో తేదీన సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభం అయ్యింది. ప్రారంభోత్సవం రోజున దాదాపు మూడున్నర లక్షల రూపాయలు పూలు, ఇతర డెకరేషన్ల కోసమే ఖర్చు చేశారట! ఆ రోజును సంబంరంగా జరిగిన ఈ ఉత్సవం కోసం అంత ఖర్చు చేసి చాంబర్ ను అలంకరించారట! మరి ఒకవైపు విరాళాలు సేకరిస్తున్న ప్రభుత్వమే ఈ విధంగా డబ్బు ఖర్చు చేయడం విడ్డూరమైన విషయమేనని చెప్పక తప్పదు! హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలపై ఖర్చు చేయడం విడ్డూరం అయితే, వాటి ఓపెనింగ్స్ కోసం ఇలాంటి ఖర్చు చేయడం మరింత విడ్డూరమేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: