జపాన్ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో కొన్నిమార్పులు చేయవచ్చని కదనాలు వస్తున్నాయి.ఆయన కొందరు మంత్రుల పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం అయింది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన దీనిపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో ముగ్గురు మంత్రుల శాఖలను మార్చవచ్చని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి , హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ,సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. హోం శాఖపై రాజప్ప పట్టు సాధించలేకపోయారని, మరింత సమర్ధంగా పనిచేయవలసిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.కాగా కిషోర్ బిజెపితో సంబందంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇక పుల్లారావు తన శాఖ సమాచారాన్ని పూర్తి గా పొందలేకపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో వీరి శాఖలలో మార్పు చేయవచ్చని అంటున్నారు.అలాగే మరికొందరికి అవకాశం ఇస్తారా?లేదా అన్నది చెప్పలేమని అంటున్నారు.కాగా ఏడాది తర్వాత మాత్రం మంత్రుల పనితీరు ఆదారంగా పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: