భారతీయ జనతా పార్టీతో ఎంఐఎం మిలాఖత్‌ అయిందని మహారాష్ట్రలో బిజేపీకి పరోక్షంగా మద్దతు పలకటమే ఇందుకు నిదర్శనమని జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోనే ఇంపీరియల్‌ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఇద్దీరు ఎమ్యెల్యేలను కలిగి ఉన్న ఎంఐఎం, బిజేపీ ప్రభుత్వ ఏర్పటుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదన్నారు. ఢిల్లిలో జరగనున్న ఎన్నికల్లొనూ ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్దపడుతూ పరోక్షంగా బిజేపీకి మద్దతు పలికేందుకు యత్నాలు చేస్తుందని దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు. శంషాబాద్‌ విమానాశ్రయ పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తు న్యాయస్థానానికి వెళ్లాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీసుకుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ పేరును మారుస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఖండిస్తోందన్నారు. తమ పార్టీ నుంచి పిరాయించిన శాసనసభ్యులపై రాజ్యాంగ పరమైన చర్యలను తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ శాసనసభాపతిని కాంగ్రెస్‌ నేతలు కలిసి విజ్ఞప్తి చేసినా వారిపై చట్ట పరమైన చర్యలను తీసుకోవడంలో స్పీకర్‌ జాప్యం చేస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. సభాపతి ఈ విషయంలో పక్షపాతం గా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఫిరాయింపుల విషయమై చట్టంలో మార్పులు అవసరమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్య మంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు పార్టీ ఫిరాయింపులను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుల ప్రోత్సహిస్తున్న విధంగా ఏనాడు ప్రోత్సహించలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి నేడు రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో నమ్మ పలికి ఆయా వర్గాలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ను కోరామని ఒక ప్రశ్నకు జవాబుగా దిగ్విజయ్‌ చెప్పారు. రా ష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ పరంగా మరికొన్ని సదస్సులను నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మరిన్ని సమీక్షా సమావేశాలను రాష్ట్రంలో కొనసాగిస్తామన్నారు. 2015వరకు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 28వ తేదీ వరకు ప్రతిబ్లాక్‌, పోలింగ్‌ బూత్‌ల వారీగా సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టడం జరుతుందన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన నేపథ్యంలో వారం రోజుల పాటు పార్టీ సభ్యత్వ నమోదును దేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టనున్నామని ఇందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొంటూ పార్టీ నాయకులకు సహకరిస్తారన్నారు. ఆయనతో పాటు మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, టిపీసీసీ ఛీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: