ఎంత పనిచేశామన్నది కాదు.. ఎంతగా చెప్పుకున్నామన్నది ప్రధానం. ఇదే మార్కెటింగ్ వ్యూహం. ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు. పొలిటికల్ లాబీయింగ్ లోనూ, ప్రమోషన్లోనూ.. మీడియా మేనేజ్ మెంట్ లోనూ కొత్తపుంతలు తొక్కిన వ్యక్తి చంద్రబాబు.. అందుకే విదేశీ పర్యటనలకు కూడా ఆయన పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, రాష్ట్రానికున్న సహజ, మానవ వనరులు.. పెట్టుబడులకు ఉన్న సానూకూల అంశాలను వివరిస్తూ చంద్రబాబు దాదాపు 6 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియా తయారు చేయించారు.                                  ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో ఈ వీడియో రూపొందించారు. జపాన్ పర్యటనలో ఈ వీడియోను విరివిరిగా ఉపయోగించబోతున్నారు. ఆ వీడియోలో చంద్రబాబు జపాన్ పారిశ్రామిక వేత్తలకు వారి భాషలోనే స్వాగతం పలకలం ఓ విశేషం. చక్కటి విజువల్స్ తో, నేపథ్య సంగీతంతో ఈ వీడియో రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం.... ద సన్ రైజ్ ఆపర్ ట్యూనిటీస్, ఫర్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే నినాదాన్ని ఈ వీడియో జపాన్ ముందు ఉంచుతోంది. 2020 నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆవిర్భావిస్తుందని ఈ వీడియోలో ప్రకటించారు.                               అంతేకాదు.. ఈ వీడియోలో ఇప్పటికే ఏపీలో పరిశ్రమలు పెట్టిన వారి స్పందన కూడా జతపరిచారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీతో పాటు విశాఖ సెజ్ లో ఇప్పటికే పరిశ్రమలు స్థాపించిన జపాన్, కొరియా, చైనా, అమెరికా దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ఉన్నతాధికారుల అభిప్రాయాలు జత చేశారు. రాష్ట్రంలో ఆంగ్ల భాష బాగా మాట్లాడకలిగిన వారుండటం..., ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అధికంగా ఉండటం..., మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్ మెంట్ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఉండి నాణ్యమైన విద్యను అందిస్తుండటాన్ని వంటి అంశాలను పెట్టుబడి దారులను ఆకర్షించేలా వీడియో తయారు చేశారు. మరి ఈ వీడియోతో జపాన్ పారిశ్రామికవేత్తలు ఫ్లాటవుతారా..పెట్టుబడులు ప్రవహింపచేస్తారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: