ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి లక్ష రెండువందల పదమూడు కోట్ల రూపాయల ఆర్ధికసాయం కావాలని కేంద్రాన్ని కోరింది.ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ రాజధాని అవసరాల నిమిత్తం ప్రతిపాదనలు పంపాలని కోరగా రాష్ట్రం ఏకంగా లక్ష కోట్లు కావాలని అడగడం విశేషం. నిజానికి నాలుగు లక్షల కోట్లు కావాలని అంటూ లక్ష కోట్ల మేర ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనల కాపీలను ప్రణాళిక సంఘానికి, ఆర్దిక సంఘానికి కూడా పంపారు. ఈ ప్రతిపాదనలలో ఒక్క భూ సేకరణకే 20,500 కోట్లు కావాలని కోరారు. రాజదాని నగరానికి వివిధ జిల్లాల నుంచి రోడ్ల నిర్మాణానికి 12930 కోట్లు ,శాసనసభ, రాజ్ భవన్ ,హైకోర్టు ఇలా వివిధ సదుపాయాల నిమిత్తం లక్ష కోట్ల మేర అవసరమవుతాయని అంచనా వేశారు. విద్యుత్ ,కేబుల్ వ్యవస్థకు పన్నెండు వేల కోట్లు కావాలని అబిప్రాయపడ్డారు.వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ,రోడ్లు,డ్రైన్ లు, ఇతర సదుపాయలు తదితర అవసరాలను ఇందులో ప్రతిపాదించారు. దేశంలో ఎక్కడా ఐదు వందల కోట్ల కు మించి రాజధాని నిర్మాణానికి సాయం చేసిన దాఖలాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: