జార్ఖండ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ రాష్ట్రం లో పెద్ద పార్టీగా అవతరించే దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపధ్యంలో ప్రత్యర్థి పార్టీ ముక్తిమోచ్చా వెనుకబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎబిపి న్యూస్‌, నీల్సన్‌ ఒపీనియన్‌ పోల్‌‌సను అనుసరించి జార్ఖండ్‌లో బిజెపి విజ యం సాధించేందుకు అవసరమైనన్ని సీట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పోల్‌‌సను అనుసరించి బిజెపి ఒంటరిగానే 30 సీట్లను గెలుచుకునే అవకాశముంది. కాగా బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీకి దిగిన ఆల్‌ జార్ఖండ్‌ యూనియన్‌ ఆరు సీట్లను గెలుచుకునే అవకాశముందని తెలుస్తోంది. అదే విధంగా ఎల్‌జెపి కూడా బిజెపితో జతకట్టిన నేపధ్యంలో ఒక సీటు దక్కించుకునే అవకాశముంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బిజెపికి పొత్తుల నేపధ్యంలో 13 సీట్లు లాభపడే అవకాశమంది. ఈ ఎగ్జిట్‌ పోల్‌‌సను ప రిశీలిస్తే జెఎంఎం ఘోర పరాజయం బాటపట్టే అవకాశాలున్నాయి. కేవలం ఆ పార్టీ ఏడు సీట్లకు మాత్రమే పరిమితమై, 11 స్థానాల్లో గట్టిపోటీ ఎదుర్కొనేలా కనిపిస్తోంది. అదేవిధంగా బాబూలాల్‌ మరాండీ పార్టీ జెవిఎం సైతం గత అసెం బ్లీ ఎన్నికలతో పోలిస్తే 5 సీట్లలో కష్టమైన పోటీని ఎదుర్కొని, 6 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తోంది.  ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే కొంత ఆశాజనకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అప్పటికన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునేలావుంది. కాంగ్రెస్‌కు 15, జెడియుకు 5, ఆర్‌జెడి మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఈ ఎగ్జిట్‌ పోల్‌ను అనుసరించి చూస్తే బిజెపి భాగస్వామ్యపక్షాలు కేవలం తమ శక్తితోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. అయి తే ఏదో ఒక పార్టీ సాయంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి 35శాతం ఓటర్లు బిజెపికి మద్ద తు పలుకుతూ ఆపార్టీ అభ్యర్థి అర్జున్‌ముండాను తమకిష్టమైన సిఎం అభ్యర్థిగా పేర్కొన్నారు. కాగా 22 శాతం ఓటర్లు బిజెపి నేత యశ్వంత్‌ సిన్హా తమ సిఎం అభ్యర్థి అని చెప్పారు. అలాగే బిజెపి నేత రఘువర్‌దాస్‌ను 10శాతం మంది ఓటర్లు తమకిష్టమైన అభ్యర్థిగా తేల్చారు. తరువాతి స్థానంలో హేమంత్‌ సోరెన్‌ ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ను మరోమారు సిఎంగా చూడాలని 37శాతం ఓటర్లు కోరుకున్నారు. అలాగే 40శాతం ఓటర్లు హేమంత్‌ పనితీరును ప్ర„శంసించారు. ఎబిపి ఈ ఎగ్జిట్‌ పోల్‌‌సను నవంబరు 11 నుంచి 17 మధ్య నిర్వహించింది. దీనిలో 7209 మంది ఓటర్ల అభిప్రాయం తీ సుకుంది. కాగా జార్ఖండ్‌లో మొత్తం 82 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిలో 81 సీట్ల కు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సేందుకు 41 సీట్లు గెలుచుకోవాల్సివుంది. మొదటి దశ పోలింగ్‌లో ఓటు హ క్కు వినియోగించుకోనున్న రెండు లక్షల మంది యువ ఓటర్లు జార్ఖండ్‌లో నవంబరు 25న జరిగే మొదటి దశ పోలింగ్‌లో రెండు లక్షల మంది యువ ఓ టర్లు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా వీరం దరి వయసు 18-19 సంవత్సరాల మధ్య ఉండడం విశేషం. ఈ నూతన ఓటర్లలో 1.15 లక్షల మంది యువకులు, 82 వేల మంది యువతులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: