ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి శుభవార్త అందించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణాలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని, భర్తీలో జరిగిన జాప్యంతో నిరుద్యోగులు నష్టపోకుండా అయిదేళ్ల వయోపరిమితిని సడలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఉద్యోగుల విభజనలో కారణమేమిటోకాని విభజన ఇంకా పూర్తి కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన జరగకుండా ఎవరో కుట్ర పన్నారని కేసీఆర్‌ ఆరోపించారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ సమస్యపై బీజేపీ సభ్యులు ఇచ్చిన 344 నిబంధన కింద ప్రస్తావించిన అంశంపై సీఎం జోక్యం చేసుకుంటూ ఈ విషయం చెప్పారు. అఖిలభబుూరత సర్వీసు అధికారుల విభజనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడులకు కూడా పలుమార్లు విన్నవించానని, కానీ జాప్యం జరుగుతూనే ఉందన్నారు. విభజన ప్రక్రియ ఆలస్యం వెనక కారణం ఎవరో దేవుడికే తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు.  60సంవత్సరాల పెంటను చిటికెలో శుభ్రం చేయడం ఎలా సాధ్యమో ప్రతిపక్షాలు చెప్పాలని సూచించారు. లక్షా 7,704 ఖాళీలు ఏర్పడవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థ కూడా ఉండదని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగాల సర్వీసుల క్రమబద్ధీకరణలో రోస్టర్‌ను ఖచ్చితంగా పాటిస్తామని చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పనిచేస్తున్నదని, త్వరలో నివేదికను అందజేస్తుందని తెలిపారు. అన్ని శాఖల్లో కలిసి కాంట్రాక్టు ఉద్యోగులు 21వేలమంది ఉంటారన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు పూర్తిస్థాయి ఉద్యోగాలు కారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి గౌరవవేతనంతో పనిచేసే పరిమిత స్థాయి ఉద్యోగులు మాత్రమేనని సీఎం అన్నారు. నూతన రాష్ట్ర ప్రభుత్వం గమ్యం, గమనాన్ని నిర్దేషించుకునే క్రమంలో ఉందని కేసీఆర్‌ చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు చాలా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారని ఆరోపించారు. కాంట్రాక్టు వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఇపుడు వారే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు తమకు అందించిన దరిద్రపు వారసతాఆ్వన్ని తుడిచివేసే పనులను చేపట్టినట్లు వివరించారు. కొన్ని శాఖలను కుదించాల్సి ఉందని, మరికొన్ని శాఖలను సరిదిద్దవలసి ఉంటుందని, త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా ఏర్పాటవుతుందని తెలిపారు. ప్రభుత్వంలోని ఒక్క ఖాళీని కూడా మిగల్చకుండా అన్ని భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్‌ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు భారీస్థాయిలో మెగవుతాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: